Green Chilli: మంట పుట్టిస్తోన్న పచ్చి మిర్చి.. కిలో రూ.160..!
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి రూ.100 దాటాయి. పచ్చి మిర్చి అయితే ఏకంగా రూ.160 చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో పచ్చి మిర్చి ధర రూ.140 నుంచి రూ.160 పలుకుతోంది. జనలు పచ్చి మిర్చి కొనడమే మానేశారు. హోటళ్లు, రెస్టారెంట్, హాస్టళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్లు కాస్త తక్కువ క్వాలిటీ పచ్చి మిర్చి వాడుతున్నారు.
కొందరితే అస్సలు పచ్చి మిర్చిని వాడడం లేదు. పవు కిలో పచ్చి మిర్చికి రూ.40 వసూలు చేస్తున్నారు. మే వరకు సాధారణంగా ఉండే ధరలు.. జూన్ రెండో వారంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు ధర పలికింది. కిలో టమాటా రూ.124 లకు పెరిగింది. సాధారణంగా మదనపల్లె మార్కెట్ కు రోజుకు 1500 టన్నుల టమాటా వస్తుంది.

గురువారం 700 టన్నుల టమాటా రావడంతో ధర భారీగా పెరిగింది. టమాటా దిగుబడి తగ్గడం.. పలు రాష్ట్రాల్లో వర్షాలకు టమాటా పంటలు దెబ్బతనడంతో ఈ పరిస్థితి ఏర్పాడినట్లు కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ఆకు కూరల రేట్లు కూడా పెరిగిపోయాయి. మిగతా కూరగాయల రేట్లు కూడా భారీగా పెరిగాయి. పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చల కూర, మెంతికూర, కొత్తిమీర, బచ్చల్ కూర, గంగవెల్లికూరల ధరలు భారీగా పెరిగాయి. కొత్తిమీర, పుదీనా ధరలు కూడా అంతే ఉన్నాయి.
కాకరకాయ రూ. 100, వంకాయ రూ. 80, బీరకాయ రూ.80, క్యారెట్ రూ.80, దొండకాయ రూ.80, ఉల్లిగడ్డ రూ.30, బెండకాయ రూ. 80, అలచంద రూ.80, దోసకాయ రూ.60, గోరుచిక్కుడ రూ. 80 గా ఉన్నాయి. అటు కోడికూర, కోడి గుడ్డు ధరలు కూడా బాగానే ఉన్నాయి. కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి గుడ్డు ఒకటి రూ.6 నుంచి రూ.7 గా ఉంది. కూరగాయల ధరలే కాదు.. ఉల్లి ధరలు కూడా పెరిగాయి.


Click it and Unblock the Notifications