బంగారం ధర మరోసారి పెరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పుత్తడి ధర పడుతూ లేస్తూ వస్తుంది. తాజాగా బంగారం ధర మరోసారి పెరిగింది. శుక్రవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.220 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ. 72,450 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,410 గా ఉంది. వెండి కిలో రూ.1500 పెరిగి రూ. రూ. 92600 చెరింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 72,460 లు ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ. 66,430 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,600 గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,560 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,450 ఉండగా.. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,410 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73000 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67010గా ఉంది.

కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 66410 ఉండగా.. 24 క్యారెంట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72450 గా ఉంది. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల మధ్య సేఫ్ హెవెన్ డిమాండ్ కారణంగా MCXలో ఈరోజు బంగారం ధర పెరిగింది. ఈ ఏడాది చివర్లో US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని పెరుగుతున్న పందెం కారణంగా కూడా బంగారం ధరకు మద్దతు లభించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. MCX బంగారం 0.18% పెరిగి 10 గ్రాములకు రూ.72,715 వద్ద, వెండి 0.51% తగ్గి కిలోకు రూ.91,100 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం 0.1% పెరిగి ఔన్సుకు $2,362.60 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications