IPO News: ఈవారం ఐపీవోల కోలాహలం.. కొత్తగా 4 ఐపీవో ఇష్యూలు, 5 లిస్టింగులు..
Next Week IPOs: ఫిబ్రవరిలో వరుసగా చిన్నపెద్ద కంపెనీల నుంచి ఐపీవోలు మార్కెట్లలోకి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు వీటిలో బెట్టింగ్ వేసి భారీగా డబ్బు కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
ముందుగా ఈవారం మార్కెట్లో జాబితా అయ్యేందుకు వస్తున్న కంపెనీల వివరాలను పరిశీలిస్తే.. అపీజయ్ సురేంద్ర పార్ట్ ఐపీవో ఫిబ్రవరి 12న లిస్టింగ్ కానుంది. అయితే ఫిబ్రవరి 14న రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జాబితా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరిగా ఇటాలియన్ ఎడిబుల్స్ ఐపీవో ఫిబ్రవరి 12న మార్కెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం.

1. వైభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీవో ఫిబ్రవరి 13న పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. కంపెనీ ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.141-151గా నిర్ణయించింది. దీని ద్వారా కంపెనీ రూ.72.17 కోట్లను సమీకరించాలని చూస్తోంది.
2. వైజ్ ట్రావెల్ ఇండియా క్యాబ్స్ ఐపీవో ఫిబ్రవరి 12, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో మార్కెట్ల నుంచి రూ.94.68 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 64.41 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.140 నుంచి రూ.147గా నిర్ణయించింది.
3. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న థాయ్ కాస్టింగ్ ఐపీవో ఫిబ్రవరి 15న ప్రారంభం అవుతోంది. కంపెనీ క్యాపిటల్ రైజ్ చేయటం కోసం 61.3 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది.
4. ఫిబ్రవరి 15న పెట్టుబడిదారుల కోసం తెరచుకోనున్న కలహృదన్ ట్రెండ్జ్ ఐపీవో ఫిబ్రవరి 20న ముగియనుంది. ఈ క్రమంలో పూర్తిగా 49.98 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.22.49 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. వీటికి తోడు మరిన్ని కంపెనీల ఐపీవోలు ఇష్యూ రానున్న వారం ముగించుకుని జాబితాకు సిద్ధమౌతున్నాయి. ఎంటెరో హెల్త్ కేర్, ఆల్పెక్స్ సోలార్ లిమిటెడ్, రుద్ర గ్యాస్ ఎంటర్ ప్రైజ్ కంపెనీల ఐపీవోలు ఇష్యూ ఈవారం ప్రారంభంలోనే ముగియనుంది. దీంతో మార్కెట్లలో మెుత్తానికి భారీ సంఖ్యలో వస్తున్న ఐపీవోలతో కోలాహలం కొనసాగనుంది.


Click it and Unblock the Notifications