Allu Arjun News: ఒడిదుడుకుల్లో అల్లు అర్జున్ బిజినెస్.. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో..
Aha: ఇండియాలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం అంతకంతకూ విస్తరిస్తోంది. ఈ విభాగంలో పెద్దమొత్తం మార్కెట్ వాటా దక్కించుకునేందుకు దిగ్గజ విదేశీ కంపెనీలు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ ఇందులో ముందు వరుసలో ఉంటాయి. మరి ఈ పోటీలో స్థానిక సంస్థలు తట్టుకుని నిలబడగలవా అనే ప్రశ్న తలెత్తక మానదు.
అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోగానే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన మార్కు చూపించారు. 2020లో స్థాపించిన ఆహా ద్వారా OTT బిజినెస్‌లోకి ప్రవేశించారు. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ను త్వరలోనే విక్రయించనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ కూడా ఇదే విషయంపై నివేదిక వెలువరించింది.

తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సహా ప్రత్యేకమైన కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఆహాను ఓ మంచి ప్లాట్‌ఫారమ్‌గా తీర్చిదిద్దాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో తమిళ భాషను కూడా కలపడంతో తన పరిధిని విస్తరించింది. వ్యూయర్‌షిప్‌లో మంచి విజయం సాధించినప్పటికీ, ఆర్థిక సవాళ్లను అధిగమించలేకపోతున్నట్లు సమాచారం.
దీనికితోడు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ మరియు జీ5 వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌లు పోటీలో ఉన్నాయి. భారీ-బడ్జెట్ చిత్రాలను అవి ఎగరేసుకుపోతుండగా.. ఆహా మాత్రం సాధారణ, చిన్న చిత్రాలపై దృష్టి సారిస్తూ వస్తోంది. దీంతో ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటే ఆహా సబ్‌స్క్రిప్షన్ ధర కూడా తక్కువగా ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్లాట్‌ఫారమ్ నిర్వహణలో యాజమాన్యం ఆసక్తిని కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications