Allied Blenders IPO: జూలై మాసంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి వరుస ఐపీవోల అరంగేట్రాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి వచ్చిన లిక్కర్ స్టాక్ బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు తొలిరోజో లాభాలను అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రముఖ మద్యం విక్రయ సంస్థ అలైడ్ బ్లెండర్స్ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో నేడు మార్కెట్లోకి వచ్చిన కంపెనీ షేర్లు బీఎస్ఈలో 13 శాతం ప్రీమియం ధర రూ.318.10 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు 14 శాతం ప్రీమియం ధర రూ.320 వద్ద జాబితా అయ్యాయి. బలమైన లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు క్షీణతకు గురయ్యాయి. కంపెనీ నేడు ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.267 నుంచి రూ.281గా ఉంచింది.

ఐపీవో షేర్లు ఇంట్రాడేలో బీఎస్ఈలో గరిష్ఠంగా రూ.319.90 స్థాయిని అందుకోగా.. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో స్వల్పంగా తగ్గాయి. కంపెనీ షేర్లు ఊహించిన స్థాయిలో ప్రీ-లిస్టింగ్ చర్చలకు అనుగుణంగా లేదని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ వెల్త్ హెడ్ శివాని నయతి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవో షేర్లను హోల్డ్ చేయాలనుకుంటున్నట్లయితే.. పెట్టుబడిదారులు తమ స్టాప్ లాస్‌ను ఇష్యూ ధర వద్ద ఉంచాలని సూచించారు.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 53 షేర్లుగా నిర్ణయించగా ఇందుకోసం కనీసం రూ.14,893 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.26 తగ్గింపును ఆఫర్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో జూన్ 25 నుంచి 27 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 24న తెరుచుకున్న ఐపీవో వారి నుంచి రూ.449.10 కోట్లు సమీకరించింది. అలాగే తాజా ఐపీవో నుంచి రూ.1,500 కోట్లు విజయవంతంగా సమీకరించింది.
ఐపీవో ఇష్యూను పరిశీలిస్తో ఇందులో రూ.1000 కోట్లకు తాజా ఈక్విటీ షేర్ల జారీ ఉండగా.. మిగిలిన రూ.500 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనుందని కంపెనీ వెల్లడించింది. OFS కింద బీనా కిషోర్ ఛబ్రియా, రేషమ్ ఛబ్రియా, జితేంద్ర హేమ్‌దేవ్, నీషా కిషోర్ ఛబ్రియా తమ షేర్లను విక్రయిస్తారు. తాజా ఐపీవో ద్వారా కొత్తగా సేకరించిన మెుత్తంలో రూ.720 కోట్లను కంపెనీ రుణాల చెల్లింపుకు వినియోగించనున్నట్లు వెల్లడైంది. ఒక భాగం సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ రుణాలు మెుత్తం రూ.808 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఐపీవో సొమ్మును లిక్కర్ కంపెనీ వినియోగించాలని చూస్తోంది.
అలైడ్ బ్లెండర్స్ భారత్‌తో పాటుగా అంతర్జాతీయంగా మద్య పానీయాల తయారీ, మార్కెటింగ్, విక్రయ వ్యాపారంలో ఉంది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కాతో సహా వివిధ రకాల భారతీయ తయారు చేసిన విదేశీ మద్యం ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ, జాలీ రోజర్ రమ్, క్లాస్ 21 వోడ్కా వంటి బ్రాండ్ల కింద తన విక్రయాలను నిర్వహిస్తోంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.1.6 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 17.2 శాతం పెరిగి రూ.3,146.6 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో లాభం ఏడాది ప్రాతిపదికన 46.8 శాతం పెరిగి రూ.4.2 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications