Indigo: ప్రయాణీకులను దారిలోనే దించేసిన ఇండిగో ఫ్లైట్.. ఖర్చుల తగ్గింపుకు నయా ప్లాన్ కాదుగా..?

Indigo: దేశీయ విమానయాన రంగం తారాజువ్వలా దూసుకుపోతోంది. గత రికార్డులను తిరిగి రాస్తూ అటు ప్రయాణీకులతో పాటు ఇటు ఫ్లైట్స్ సంఖ్యలోనూ వృద్ధి సాధిస్తోంది. ఈ సమయంలో ఆయా ఎయిర్ లైన్స్ తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 8 మంది విమాన ప్రయాణీకులకు ఇండిగో ఫ్లైట్ ఊహించని ఝలక్ ఇచ్చింది.

ఇండిగోకు చెంది ఓ ఫ్లైట్ ఆదివారం అమృత్‌ సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వెళ్తోంది. విమానం రాత్రి 9.30 సమయంలో ఎలక్ట్రానిక్ సిటీలో దిగిన అనంతరం చెన్నై వెళ్లేందుకు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. దీంతో సదరు ఎయిర్ లైన్స్ తమను గమ్యస్థానానికి చేర్చడం మానేసి ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిందని ప్రయాణీకులు ఆరోపించారు. తమకు కనీసం బస కూడా ఏర్పాటు చేయలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

allegations on Indigo flight as it deboarded 8 passengers

బెంగళూరు విమానాశ్రయంలో దిగాలని ఫ్లైట్ సిబ్బంది సూచించినట్లు ప్రయాణీకులు తెలిపారు. వారిని మరో విమానంలో చెన్నై చేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని వెల్లడించారు. దీంతో తామంతా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయామని మండిపడ్డారు. ఈ ఘటనపై ఇండిగో యాజమాన్యం వివరణ ఇచ్చింది.

ఆ ప్రయాణీకులు సరైన సమయానికి చెన్నై వెళ్లే విమానం వద్దకు చేరుకోలేకపోవడంతో ఫ్లైట్ మిస్ అయినట్లు ఇండిగో పేర్కొంది. వారికి రాత్రి వసతితో పాటు తదుపరి అందుబాటులో ఉన్న విమానంలో బుకింగ్ కల్పించినట్లు స్పష్టం చేసింది. బస విషయంలో ఆరోపణలను ఖండించింది. కొందరు ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే ఉంటామని చెప్పినట్లు వివరించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ, ప్రయాణీకులకు క్షమాపణలు తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+