అలహాబాద్ బ్యాంకు శనివారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తమ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తూ బ్యాంక్ ఆస్తుల బాధ్యత, నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు ఆదివారం (మార్చి 1వ తేదీ) నుంచే అమల్లోకి వస్తాయని ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో కస్టమర్లకు, ముఖ్యంగా రిటైల్ రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు 5.15%గా ఉంది.
ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను అసెట్ లయబిలిటీ కమిటీ (ALCO) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని, ఇవి మార్చి 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని అలహాబాద్ బ్యాంకు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. 2019 ఫిబ్రవరి నుండి ఆర్బీఐ రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో ఎస్పీఐ సహా వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకుల నుండి వివిధ రకాల రుణాలు తీసుకునే వారిపై భారం తగ్గుతుంది. అదే సమయంలో డిపాజిట్ చేసే వారికి వడ్డీ రేటు తగ్గి వస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications