యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగంలో కొన్ని కొత్త నియమాలు 2025 ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఇవి PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌లు ద్వారా జరిగే లావాదేవీలను మరింత వేగంగా, సురక్షితంగా, సమర్థవంతంగా మార్చే ఉద్దేశంతో NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈ మార్పులు తీసుకొస్తోంది.

ఈ మార్పుల వల్ల బ్యాంకులు, యాప్‌లు, వినియోగదారులందరికీ ప్రయోజనం కలగనుంది.
1. ఒక్కో యాప్‌లో మీరు మీ బ్యాలెన్స్‌ను రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు. మీరు Google Pay, PhonePe, Paytm వంటివి వేర్వేరు యాప్‌లుగా ఉపయోగిస్తే, ఒక్కో యాప్‌కి వేర్వేరు 50 సార్లు అనుమతించబడుతుంది. ఇది సర్వర్ పై భారం తగ్గించే, ట్రాన్సాక్షన్ వేగాన్ని మెరుగుపరుచుతుంది.
2. మీరు పంపిన పేమెంట్ పెండింగ్‌లో ఉంటే, దాని స్థితిని మూడుసార్లు మాత్రమే చెక్ చేయొచ్చు. ప్రతి చెక్ మధ్య కనీసం 90 సెకన్ల విరామం ఉండాలి. దీని వల్ల సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గి, ట్రాన్సాక్షన్లు చక్కగా ప్రాసెస్ అవుతాయి.
3. ఇకపై ఆటోపే (AutoPay) లావాదేవీలు కింది సమయాల్లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల మధ్య, రాత్రి 9:30 తరువాత. ఇది ట్రాఫిక్‌ను సమంగా పంచేందుకు తీసుకున్న నిర్ణయం.
4. మీరు మీ యాప్‌లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడగలుగుతారు. ఇది కూడా సిస్టమ్ వేగాన్ని పెంచేందుకు అనుసరించిన చర్య.
5. మీరు పొరపాటుగా ఎవరైనా తప్పు వ్యక్తికి డబ్బు పంపితే, ఒక నెలలో మొత్తం 10 సార్లు మాత్రమే డబ్బు తిరిగి ఇవ్వమని అభ్యర్థించవచ్చు. ఈ 10 అభ్యర్థనలలో, ఐదు మాత్రమే మీరు స్వయంగా పంపిన డబ్బులకే కావాలి. అంటే, ప్రతి చిన్న పొరపాటుకు చాలాసార్లు అభ్యర్థించలేరు ఒక పరిమితి ఉంటుంది.
6. డబ్బు పంపించే ముందు, ఇప్పుడు మీరు రిసీవర్ యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ పేరును యాప్‌లో చూడగలుగుతారు. ఇది తప్పులు, మోసాలను తగ్గించేందుకు మంచి మార్గం.
7. NPCI చెబుతున్నది ఏమిటంటే బ్యాంకులు మరియు UPI యాప్‌లు తమ వ్యవస్థల వాడకాన్ని (API) జాగ్రత్తగా గమనించాలి. వాటిలో ఏదైనా తప్పుగా పనిచేస్తే లేదా నియమాలు పాటించకపోతే, పెనాల్టీలు లేదా యాక్సెస్‌ను తగ్గించే చర్యలు తీసుకోబడే అవకాశం ఉంది. అంటే, సరైన రీతిలో పనిచేయకపోతే నిషేధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ మార్పులను 2025 జూలై 31వ తేదీ లోపల అమలులోకి తేవాలని NPCI ఆదేశించింది. ఈ కొత్త నియమాలన్నీ UPI వేగాన్ని పెంచి, ట్రాఫిక్‌ను తగ్గించి, మోసాలను నివారించేందుకు తీసుకొస్తున్నారు. యాప్‌లు నిర్లక్ష్యంగా పంపే చెక్, స్టేటస్ API రిక్వెస్టులు, సర్వర్‌పై భారం పెడుతున్నాయని గుర్తించారు.
UPI పై IMF ప్రశంసలు
ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కూడా UPI వ్యవస్థను ప్రశంసించింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశం. UPI ద్వారా ప్రతి నెలా 18 బిలియన్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వాడకం తగ్గుతోంది అని IMF పేర్కొంది.
ఇప్పుడు అమలు కాబోయే ఈ కొత్త UPI నియమాలు వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఇవి మొత్తం వ్యవస్థను వేగవంతం, భద్రమైనదిగా మార్చే దిశగా ఒక మంచి మెట్టు అని చెప్పవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications