డిజిటల్ ఇండియా ప్లాన్‌లో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా మరో దిశగా దూసుకెళ్తోంది. భారత్ నెట్ బ్రాడ్ బాండ్ సర్వీస్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న ప్రతి గ్రామానికి మార్చి 2020 నాటికి ఉచిత వైఫై అందించనున్నారు.

అన్ని గ్రామాలకు వైఫై
భారత్ నెట్‌తో అనుసంధానమైన అన్ని గ్రామాలకు 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందించగలుగుతామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేశామని, దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గత ఏడాది నాటికి 1గ్రామాలకు దీనిని కనెక్ట్ చేశారు. రాబోవు నాలుగేళ్లలో 15 శాతం గ్రామాలను అనుసంధానిస్తామని నాడు చెప్పారు.

48వేల గ్రామాల్లో ఉచిత వైఫై సేవలు
ప్రస్తుతం భారత్ నెట్ ద్వారా 48వేల గ్రామాల్లో ఉచిత వైఫై సేవలు ఉన్నాయి. వీటితో పాటు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ల ద్వారా బ్యాంకింగ్ సేవలు కూడా త్వరలో పొందవచ్చు. డిజిటల్ సేవల్ని విస్తృత పరిచేందుకు 2014లో 60వేల CSCలను కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీటి సంఖ్యను 3.60 లక్షలకు పెంచింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవలు అందించే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం CSC ఈ-గవర్నెన్స్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రామాల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు డిజిటల్ విభజనను తగ్గించేందుకు వీలవుతుందని చెబుతున్నారు.
గ్రామాల స్థితిగతులు మారిపోతాయి...
భారత్ నెట్ ద్వారా గ్రామాల్లో ఉచిత వైఫై అందిస్తే ఈ గ్రామాల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని, ఆయా గ్రామాల్లో ఉన్న చిన్న చితక వ్యాపారస్తులను ప్రోత్సహించినట్లవుతుందని చెబుతున్నారు. దీంతో పాటు విద్య, ఆరోగ్యం, ఆఱ్థిక సేవల్లో గ్రామీణులను మమేకం చేసేందుకు వీలు పడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications