ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓపెన్‌ఏఐ (OpenAI), ఇప్పుడు భారతదేశంలో తన మొదటి ఆఫీస్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఆఫీస్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

"ఢిల్లీ ఎందుకు?"
ఈ వార్త బయటకు రాగానే చాలా మంది ఇంటర్నెట్లో వాల్ల ప్రశ్నలు లేవనెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ బెంగళూరులో ఉంది. అయినా OpenAI ఢిల్లీని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది" అని కొందరు స్పందించారు. ఇంకొందరు "తప్పు లొకేషన్, బెంగళూరు కావాల్సింది" అని వ్యాఖ్యానించగా, మరికొందరు "ఇది చాలా సస్పెన్స్ గా ఉంది, టెక్ టాలెంట్ అంతా బెంగళూరులోనే ఉంది" అని అభిప్రాయపడ్డారు. కొందరు మరింత స్పష్టంగా, "ఢిల్లీలో ఆఫీస్ పెట్టడానికి కారణం ప్రభుత్వంతో లాబీయింగ్ చేయడమే. టెక్ టాలెంట్ మాత్రం లేదు" అని రాశారు. అదే సమయంలో "అద్భుతమైన వార్తే! కానీ ఢిల్లీ బెంగళూరును ఎలా ఓడించింది?" అంటూ ఆశ్చర్యపడ్డ వారు కూడా ఉన్నారు. అయితే అందరూ ఇలాగే ఆలోచించలేదు. కొందరు మాత్రం "ఇది మంచి ఆరంభం. భారత్‌లో ఓపెన్‌ఏఐ ఆఫీస్ రావడం ఆనందకర విషయం" అంటూ అభినందించారు.
భారతదేశంలో బెంగళూరు ఐటీ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ టాలెంట్ పూల్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎక్కువగా అక్కడే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబిఎమ్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ డెవలప్మెంట్ సెంటర్లను బెంగళూరులోనే నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా, కొత్త AI స్టార్టప్స్, రీసెర్చ్ ప్రాజెక్టులు, డెవలపర్ కమ్యూనిటీల పరంగా కూడా బెంగళూరు ముందంజలో ఉంది.
అయితే ఓపెన్‌ఏఐ తన మొదటి ఆఫీస్‌ను బెంగళూరు కాకుండా ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉండటం వల్ల కంపెనీ నేరుగా ప్రభుత్వంతో దగ్గరగా పనిచేస్తూ డేటా ప్రొటెక్షన్, AI పాలసీలు, రెగ్యులేషన్‌ల వంటి కీలక నిర్ణయాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వారు కేవలం టెక్నాలజీని మాత్రమే కాకుండా, భారత AI పాలసీ ఎకోసిస్టమ్ రూపకల్పనలో కూడా భాగస్వామ్యం అవుతారు. అదనంగా, భారత్‌లోకి వచ్చే చాలా అంతర్జాతీయ కంపెనీలు మొదట ఢిల్లీ లేదా ముంబైను ఎంచుకోవడం ఒక సాధారణ ట్రెండ్. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ కూడా ఢిల్లీని ఎంపిక చేసిందని అన్నారు.
దీంతో, బెంగళూరులోని టెక్ టాలెంట్‌ను ఆకర్షించడం కష్టమవుతుందనే అభిప్రాయం కొందరిది. ఎందుకంటే, చాలా మంది ఇంజనీర్లు తమ పని, నెట్‌వర్కింగ్, ఈవెంట్స్ all within Bengaluruలోనే కొనసాగిస్తారు. ఢిల్లీలో ఆఫీస్ పెట్టినప్పుడు, అక్కడి నుండి టాలెంట్‌ని తరలించడం లేదా కొత్తగా ఏర్పరచుకోవడం సవాలుగా మారుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో ఓపెన్‌ఏఐ రీసెర్చ్ సెంటర్ లేదా ఇన్నోవేషన్ హబ్‌ను బెంగళూరులో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టాలెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్ కల్చర్ పరంగా బెంగళూరు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కాబట్టి, ఢిల్లీ పాలసీ హబ్‌గా, బెంగళూరు టెక్ హబ్‌గా ఈ రెండూ ఓపెన్‌ఏఐకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఓపెన్‌ఏఐ CEO సామ్ ఆల్ట్‌మన్ ఒక ట్వీట్‌లో "భారత్‌లో మా మొదటి ఆఫీస్ ప్రారంభించడానికి స్థానిక బృందాన్ని ఏర్పాటు చేయడం మా ప్రణాళికలో ముఖ్యమైన భాగం. మా లక్ష్యం ఆధునిక AI టెక్నాలజీని భారతీయులందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావడం. అలాగే భారతదేశం కోసం, భారతదేశంతో కలిసి AIని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం." అని చెప్పారు.
మొత్తానికి, బెంగళూరు కాకుండా ఢిల్లీని ఎంచుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నప్పటికీ, ఓపెన్‌ఏఐ మాత్రం తన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి దగ్గరగా ఉండటం, పాలసీ మేకింగ్‌లో భాగస్వామ్యం కావడం కోసం ఢిల్లీని ఎంచుకున్నారన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Jiostar: జియో సినిమాను నంబర్ వన్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని ఏలబోతున్నారా?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications