Market Closing: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అన్ని రంగాలు గ్రీన్..
Closing Bell: ఉదయం లాభాలతో శుభారంభం చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చీవరికి భారీ లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. మార్కెట్లో నేడు అన్ని రంగాల సూచీలు ఇదే ధోరణిని కనబరిచాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 127 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 111 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 354 పాయింట్ల లాభంలో తమ ప్రయాణాన్ని లాభాలతో ముగించాయి. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ 2023లో తొలిసారిగా 18,700 మార్కును దాటింది.

ఎన్ఎస్ఈలో బ్రిటానియా, టాటా కన్జూమర్, బీపీసీఎస్, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఎల్ టి, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఎనటీపీసీ, కోల్ ఇండియా, టీసీఎస్, బజాజ్ ఆటో, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో కోటక్ బ్యాంక్, సిప్లా, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి నేడు టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications