Bank Strike: నవంబర్ 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె..

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) సభ్యులు సమ్మెకు పిలుపునిచ్చినందున వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) జనరల్ సెక్రటరీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు సమ్మె నోటీసును అందజేసాశారని సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. అసోసియేషన్‌ సభ్యులు 19.11.2022 న సమ్మె చేయనున్నట్లు తెలిపారని వివరించింది.

ప్రైవేట్ బ్యాంకులు
సమ్మె రోజుల్లో బ్యాంక్ శాఖలు, కార్యాలయాలు సజావుగా పనిచేయడానికి బ్యాంక్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సమ్మె కార్యరూపం దాల్చినట్లయితే, శాఖలు, కార్యాలయాల పనితీరు ప్రభావితం కావచ్చన్నారు. దీంతో నవంబర్ 19 బ్యాంకులు పని చేయకపోవచ్చు. బ్యాంకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రైవేట్ బ్యాంకులు యధావిధిగా పని చేయనున్నాయి.

All India Bank Employees Association will go on strike on November 19

ఎస్బీఐ నివేదిక
కాగా 20 ఏళ్లలో తొలిసారిగా దీపావళి వారంలో చెలామణిలో ఉన్న కరెన్సీ తగ్గిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. టెక్నాలజీలోని ఆవిష్కరణలు భారతీయ చెల్లింపు వ్యవస్థను మార్చాయని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. డిజిటల్ లావాదేవీలు పెరగడమే ఇందుకు కారణమని నివేదిక వివరించింది."20 సంవత్సరాలలో మొదటిసారిగా, దీపావళి వారంలో చెలామణిలో కరెన్సీ క్షీణించింది. సాంకేతికతలో ఆవిష్కరణలు భారతీయ చెల్లింపు వ్యవస్థను మార్చాయి. సంవత్సరాలుగా, భారతీయ నగదు ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మారిపోయింది" అని నివేదిక పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+