సామాన్యుడికి రిలీఫ్, EMI చెల్లింపుదారులకు 3 నెలలు భారీ ఊరట
ముంబై: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మార్కెట్లోకి రూ.3.75 లక్షల కోట్లను పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. అవసరమైన చర్యలు ఎప్పటికి అప్పుడు తీసుకుంటామన్నారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉందని, ఇలాగే ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మార్కెట్లోకు నగదు పంపింగ్, ఈఎంఐలపై భారీ ఊరట కల్పించారు. ఇప్పటికే వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. టర్మ్ లోన్ల ఈఎంఐలపై మార్చి నుండి మూడు నెలల పాటు మారటోరియం ఉంటుందన్నారు. మార్చి నుండి మూడు నెలల పాటు మారటోరియం ఉంటుందని తెలిపారు. మూడు నెలల పాటు మారటోరియం సామాన్యుడికి భారీ ఊరట. ఈ కాలంలో ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నుండి ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో చెల్లించనప్పటికీ క్రెడిట్ స్కోర్ పైన ఎలాంటి ప్రభావం చూపదు. ఎంఎస్ఎఫ్ 1 శాతం పెంపు ప్రకటించారు.

ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని శక్తికాంత దాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని కితాబిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మనమంతా సహకరిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ,ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో డిపాజిట్ల గురించి కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరి డబ్బు సురక్షితంగా ఉందని, అనవసర ఆందోళనకు గురై పెద్ద మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవద్దని సూచించారు. డిపాజిట్ల గురించి ఆందోళన అక్కర్లేదని.. అందరి డిపాజిట్లకు పూర్తి భద్రత ఉందన్నారు. లాక్ డౌన్స్,సోషల్ డిస్టెన్స్ కారణంగా ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) గుర్తించిందని, ప్రపంచ వృద్ధిలో 2019 దశాబ్దం కనిష్ట స్థాయి నుండి 2020లో నిస్సారంగా కోలుకుంటుందనే అంచనాలు పోయాయని శక్తికాంత దాస్ అన్నారు.


Click it and Unblock the Notifications