కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించి దానిని మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అంకెల గారెడీతో అందరినీ బురిడీ కొట్టించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాయదారి కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు దాదాపు రెండు నెలల లాక్ డౌన్ విధించారు. దేశవ్యాప్తంగా దాని అమలు తీరు పకడ్బందీగా సాగినా... మన దేశంలో నమోదైన కేసుల సంఖ్య ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే ఏమాత్రం తక్కువగా లేదు.
సుమారు 1,00,000 కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో కరోనా పుట్టినిల్లు ఐన చైనా దేశాన్ని కూడా దాటేసింది. మంచో చెడో తర్వాత చూడొచ్చు. ముందు ప్రాణాలు రక్షించుకుందాం అనుకున్న ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించి లాక్ డౌన్ ను విజయవంతం చేశారు. అనేక బాధలకు, ఇబ్బందులకు ఓర్చుకున్నారు.
ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతారంటే ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఎదురుచూపులు ప్రతిసారీ ఒక 'సారీ'తో ముగిసిన విషయం తెలిసిందే. దేశంలో కనీసం 90 కోట్ల మంది ప్రత్యక్షంగా కరోనా లాక్ డౌన్ వల్ల ప్రభావితం అయ్యారు. వీరందరికీ ఎలా న్యాయం చేస్తారు. మళ్ళీ బతుకుదెరువు ఎలా చూపిస్తారు అన్న ప్రశ్నలు వేధించాయి. కానీ రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ పేరుతో మరో 'సారీ' చెప్పేసి వెళ్ళింది మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.

నొప్పి ఒక చోట... మందు మరో చోట...
రోగికి నొప్పి ఎక్కడ ఉందొ తెలుసుకుని దానికి తగిన మాత్ర ఇస్తేనే అది తగ్గుతుంది. కానీ, ఇండియా లో ప్రస్తుతం జరుగుతున్నది అంతా రివర్స్. ఒకటి అడిగితే మరోటి ఇస్తున్నారు. లేదా అడిగిందానినే మనం తీసుకోలేనన్ని కండిషన్స్ పెట్టి ఇస్తున్నారు. దాంతో దాన్ని ఎలాగూ మనం తీసుకోలేం. కాబట్టి వాళ్లకు ప్రచారం.. మనకు విచారం. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 3 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అంటే దాదాపు రూ 210 లక్షల కోట్లు.
లాక్ డౌన్ వల్ల సగానికిపైగా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో జీడీపీ లో 10% నికి సమానంగా రూ 20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన చెబుతున్నప్పుడు అందరూ ఆహా ... ఇక మనకు ఎలాంటి ఢోకా లేదనుకొన్నారు. కానీ వాస్తవం మరోలా ఉంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అసలు ఎవరికి పనికొస్తుందో కూడా తేల్చుకోలేనంత గందరగోళం నెలకొంది.

పంచితే రూ 15,000....
చిత్తశుద్ధి ఉన్నట్లయితే... భారత ప్రభుత్వం ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాకేజీ ల్లో ఒకటిగా నిలిచేది. అంత డబ్బును మన దేశంలోని 135 కోట్ల మందికి సమానంగా పంచితే ఒక్కొక్క వ్యక్తికి సుమారు రూ 15,000 నగదు లభించేది. పోనీ సంపన్నులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పన్నులు చెల్లించే స్థాయి వారిని వదిలేసి మిగితా వారికి పంచితే అది రూ 20,000 స్థాయికి చేరుకునేది.
ఒక కుటుంబంలో సగటున నలుగురు వ్యక్తులు ఉన్నట్లయితే ఒక్కో కుటుంబానికి సగటున రూ 60,000 నుంచి రూ 80,000 నగదు అందుబాటులోకి వచ్చేది. అప్పుడు సహజంగానే ప్రజలు తమ తమ జీవితాలను మళ్ళీ పట్టాలెక్కించేందుకు, కనీసం 3-6 నెలల పాటు ఉపాధి దొరకకపోయినా జీవనం సాగించేందుకు వెసులుబాటు లభించేంది. కానీ, వాస్తవానికి ఒక్కో వ్యక్తికీ సగటున రూ 150 వచ్చే పరిస్థితి కూడా లేకపోవటం విచారకరం.

ఇచ్చింది 1% మాత్రమే...
మన దేశ డీజీపీ లో 10% నికి సమానమైన ప్యాకేజీ ప్రకటించామని చంకలు గుద్దుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... వాస్తవానికి ఇచ్చింది జీడీపీ లో 1 శాతానికి సమానమే. కేవలం రూ 3 లక్షల కోట్ల మేరకు కొత్తగా ప్రయోజనం చేకూరే నిధుల లభ్యత వ్యవస్థలోకి జొప్పించింది. మిగతావన్నీ పాత వాటికే కొత్త పేర్లు పెట్టి దానినే ప్యాకేజీ అని నమ్మించారు.
ఉదాహరణకు చిన్న పరిశ్రమలకు రూ 3 లక్షల కోట్ల వరకు సెక్యూరిటీ లేని రుణాలు ఇస్తామన్నారు. కానీ ఆ మేరకు నగదును బ్యాంకులకు తామే చెల్లిస్తామని చెప్పలేదు. ఈ రూ 3 లక్షల కోట్లకు గతంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న చర్యల ద్వారా వ్యవస్థ లోకి అందుబాటులోకి వచ్చింది. అంతే కానీ వాస్తవానికి కేటాయింపులు లేవు. రాష్ట్రాలకు ఎఫ్ ఆర్ బీ ఎం నిబంధనల సడలింపు కూడా ఇలాంటి నిర్ణయమే. కానీ కేంద్రం షరతులకు ఒప్పుకుంటేనే అదనపు అప్పులు తీసుకోవచ్చు. లేదంటే దాని ప్రయోజనమే లేదు. ఇలా ప్రతి చోటా లోపాయికారీ తనమే గానీ ... కుదేలైన ప్రజలు, పరిశ్రమలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఒక్క నిర్ణయమూ లేకపోవటంతో ఫలితం శూన్యమనే చెప్పాలి. ఈ మాట మనం అనటం లేదు. ఆర్థికవేత్తలే చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications