For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా కుబేరుల జాబితాలో జాక్‌మా వెనక్కు.. మొదటి స్థానం నుండి నాలుగో స్థానానికి .. రీజన్ ఇదే !!

|

చైనా కుబేరుల జాబితాను హురూన్ గ్లోబల్ వెల్లడించింది. ఏడాది క్రితం తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆలీబాబా మరియు యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఇప్పుడు చైనా కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయారు.హురూన్ గ్లోబల్ రిచ్ జాబితా ప్రకారం జాక్ మా వ్యాపార ప్రత్యర్థుల సంపద భారీగా పెరగడంతో జాక్ మా ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో జాంగ్ షాన్ షాన్ , రెండవ స్థానంలో పోనీ మా, మూడవ స్థానంలో కోలిన్ హువాంగ్ లు నిలిచారు. ప్రస్తుతం జాక్ మా నాలుగవ స్థానంలో ఉన్నారు.

చైనా ప్రభుత్వంతో చిక్కుల్లో ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా

చైనా ప్రభుత్వంతో చిక్కుల్లో ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా

2019, 2020 సంవత్సరాలలో ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా చైనా కుబేరుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. చైనా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వబోయి చిక్కుల్లో పడిన ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా పై చైనా అధినాయకత్వం కత్తి కట్టింది . గత సంవత్సరం అక్టోబర్లో చైనా బ్యాంకింగ్ వ్యవస్థ లోని లోపాలను ఎత్తి చూపిన నాటి నుంచి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. జాక్ మా వ్యాపారాలపై నియంత్రణా సంస్థలతో నిఘా పెట్టింది. బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాలను వీడాలని, చైనాలో బ్యాంకులలో అత్యధికంగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఆయనపై కక్ష సాధిస్తూనే ఉంది.

నాలుగవ స్థానానికి చేరిన జాక్ మా సంపద .. మొదటి , రెండు స్థానాల్లో ఎవరంటే

నాలుగవ స్థానానికి చేరిన జాక్ మా సంపద .. మొదటి , రెండు స్థానాల్లో ఎవరంటే

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో ఆయన వ్యాపారాలకు అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి . దీంతో సంపద విషయంలో వెనక్కి వెళ్లిన జాక్ మా నాలుగో స్థానంలో నిలిచారు . జాక్ మా మొన్నటి వరకు ఉన్న మొదటి స్థానంలో ఈసారి నాంగ్ఫూ స్ప్రింగ్ సంస్థ అధినేత జాంగ్ షాన్ షాన్ అనూహ్యరీతిలో మొదటి స్థానానికి వచ్చారు. గత ఏడాది వ్యవధిలో జాంగ్ సంపద 85 బిలియన్ డాలర్లకు చేరింది. రెండవ స్థానంలో టెన్సెంట్ హోల్డింగ్స్ అధినేత పోనీమా 74 .19 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు .

మూడో స్థానంలో కోలిన్ హువాంగ్, ఐదవ స్థానంలో టిక్ టాక్ యజమాని ఝాంగ్ యిమింగ్

మూడో స్థానంలో కోలిన్ హువాంగ్, ఐదవ స్థానంలో టిక్ టాక్ యజమాని ఝాంగ్ యిమింగ్

మూడవ స్థానంలో ఉన్న పిన్ డ్యువో డ్యువో ఈ కామర్స్ సంస్థ అధినేత కోలిన్ హువాంగ్ 69.55 మిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరిన జాక్ మా సంపద విలువ 55.6 4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక టిక్ టాక్ యజమాని టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్నారు. బైట్ డాన్స్ కు చెందిన టిక్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఈ సంస్థ అధినేత ఝాంగ్ యిమింగ్ హురూన్ గ్లోబల్ రిచ్ లిస్టులో మొదటి సారి టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకున్నారు.

Read more about: jack ma
English summary

చైనా కుబేరుల జాబితాలో జాక్‌మా వెనక్కు.. మొదటి స్థానం నుండి నాలుగో స్థానానికి .. రీజన్ ఇదే !! | Alibaba's Jack Ma no longer China's richest person, now trails in fourth place

Alibaba and Ant Group founder Jack Ma has lost the title of China's richest man, Ma was China's richest in the Hurun Global Rich List in 2020 and 2019 but now trail in fourth place behind Zhong Shanshan, Pony Ma and Collin Huang.
Story first published: Wednesday, March 3, 2021, 18:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X