చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్, దాని వ్యవస్థాపకులు జాక్‌మాకు గురుగ్రామ్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కంపెనీ మాజీ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టింది. అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్‌లో పుష్పేంద్ర పర్మార్ అనే వ్యక్తి గతంలో పని చేశారు. ఇటీవల యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్స్‌ను సెక్యూరిటీ కారణాలతో కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.

చైనా వ్యతిరేక వార్తలు సెన్సార్
కంపెనీ యాప్స్, డాక్యుమెంట్స్‌లో సెన్సార్‌షిప్, ఫేక్ న్యూస్‌లపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగం నుండి తొలగించారని ఆ కంపెనీకి చెందిన ఈ మాజీ ఉద్యోగి ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురుగ్రామ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. చైనాకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఆ కంపెనీ సెన్సార్ చేస్తోందని పేర్కొన్నారు. అలాగే యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలా ఉల్లంఘనలు..
2000 నోట్లు రద్దు, భారత్-పాక్ మధ్య యుద్ధం తప్పు అంటూ తప్పుడు వార్తలను యూసీ న్యూస్ పబ్లిష్ చేసిందని పేర్కొన్నారు. ఇండియా-చైనా సరిహద్దుకు సంబంధించిన వార్తలను కూడా సెన్సార్ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చైనాతో పాటు డ్రాగన్ యాప్స్, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌లకు ప్రతికూలంగా ఉన్న కంటెంట్‌ను కంపెనీ సెన్సార్ చేసేదని, వీటిని సామాజిక, రాజకీయ గందరగోళానికి తావిచ్చేవిగా చూపేవని పేర్కొన్నారు. వీటిపై తాను ప్రశ్నించడంతో తనను అకారణంగా తొలగించారని తెలిపారు.

కోర్టుకు హాజరు
గురుగ్రామ్ జిల్లా కోర్టు సివిల్ జడ్జి సోనియా షికండ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన అలీబాబా, జాక్ మా సహా కంపెనీకి చెందిన పన్నెండుమంది అధికారులు కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నెల రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటికే యాప్స్ నిషేధించింది కేంద్రం. ఇప్పుడు అలీబాబా గ్రూప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే తాము చట్టాలకు కట్టుబడి పని చేస్తున్నామని యూసీ ఇండియా తెలిపింది. పిటిషనర్ పైన ఎలాంటి కామెంట్ చేయలేదు. పుష్పేంద్ర పర్మార్ 2017 అక్టోబర్ వరకు గురుగ్రాంలోని యూసీ వెబ్ కార్యాలయంలో అసోసియేట్ ఎడిటర్‌గా పని చేశారు.


Click it and Unblock the Notifications