ITR Filing: ఇంకా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదా..?? చిక్కుల్లో పడతారు జాగ్రత్త..
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి అవకాశం దగ్గర పడుతోంది. దీంతో చాలా మంది హడావిడిలో ఉన్నారు.
ఇప్పటి వరకు మీరు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబర్ 31, 2023 ఇందుకు చివరి అవకాశంగా ఉంది. ఆ తర్వాత ఫైల్ అయ్యే రిటర్నులపై జరిమానాలు, ఆలస్యానికి వడ్డీ చెల్లించాలని గుర్తుంచుకోండి. చట్ట ప్రకారం రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఫైల్ చేసే వారిపై ఆలస్య రుసుము రూ.4,000 ఉండగా.. రూ.5 లక్షలకు మించిన పన్ను చెల్లింపుదారులు రూ.5,000 ఫైన్ చెల్లిచాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో చెల్లించని పన్ను మెుత్తంపై 1 శాతం వడ్డీని కూడా లేటు చేసిన కాలానికి కట్టాల్సి ఉంటుంది.

అలాగే డిసెంబర్ 31, 2023 చివరి గడువు కోల్పోతే.. భారీ ఆర్థికపరమైన చిక్కులు వస్తాయని తెలుస్తోంది. ITR ఫైలింగ్ మిస్ అయితే "నిజమైన కారణాల వల్ల", సెక్షన్-119 కింద జాప్య అభ్యర్థనకు క్షమాపణను దాఖలు చేయవచ్చు. గడువు లోపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేకపోవటానికి గల కారణఆలను పేర్కొంటూ.. ఆలస్యాన్ని క్షమించమని ఆదాయపు పన్ను అధికారులను కోరవచ్చు. ఈ పరిస్థితిలో జరిమానా రూ.10,000, వడ్డీ ఉంటుంది. అలాగే పేర్కొన్న రిటర్న్‌ను దాఖలు చేసేంత వరకు 1% విధించబడుతుంది.
మీ ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి వాయిదా వేయడం చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే చాలా మంది చివరి క్షణాల్లో హడావిడిగా పన్నును ఆదా చేసుకునేందుకు సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెడుతుంటారు. అవసరం లేకుండా ఎల్ఐసీ, ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయటం, ఏవైనా విలువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు కొనటం, ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయటం లాంటివి చేస్తుంటారు. సరైన గోల్ లేకుండా చేసే పెట్టుబడుల్లో తప్పుల వల్ల భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంటుందని టాక్స్ ప్లానర్లు హెచ్చరిస్తుంటారు.


Click it and Unblock the Notifications