రేషన్ కార్డు సామాన్యులకు చాల ముఖ్యమైనది. ఎందుకంటే భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రేషన్ కార్డు అనేది అధికారిక డాక్యుమెంట్, దీని ద్వారా అర్హత కలిగిన పేద కుటుంబాలు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సబ్సిడీ ధరకే ఆహార ధాన్యాలను అందిస్తుంది. అంతేకాదు చాలా మందికి రేషన్ కార్డు ఒక సాధారణ గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. మీకు రేషన్ కార్డ్ ఉండి మీరు మీ e-KYCని పూర్తి చేయకపోతే e-kyc చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30 అని గుర్తుంచుకోవాలి. గతంలో దీనికి చివరి తేదీ మార్చి 31గా ఉండేది. అయితే మీరు ఇప్పుడు ఇచ్చిన గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే మీ పేరు రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్ట్ నుండి తొలగించవచ్చు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు 6 సార్లు ఈ గడువును పొడిగించింది. కానీ ఈసారి ఈ తేదీని పొడిగించడానికి ఇదే చివరిసారి అని చెబుతున్నారు.

రేషన్ కార్డుదారులకు e-KYC ఎందుకు అవసరం: ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ ప్రయోజనాలు అర్హత ఉన్నవారికి ఇంకా అవసరమైన వారికి మాత్రమే చేరుతుందని E-KYC స్పష్టం చేస్తుంది. ఈ ప్రక్రియ సహాయంతో నకిలీ రేషన్ కార్డులను తొలగించవచ్చు అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం(PDS)లో పారదర్శకతను పెంచుతుంది.
e-KYC ఎలా చేయాలి: e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు. దీని కోసం ముందుగా మీ రాష్ట్రంలోని PDS అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లండి. తరువాత 'e-KYC for Ration Card' ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత రేషన్ కార్డ్ నంబర్ అండ్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. చివరగా మీ సమీపంలోని రేషన్ షాప్ సందర్శించి ఇక్కడ e-POS మెషిన్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోండి.
మీరు e-KYC చేయకపోతే ఎం అవుతుందంటే : మీరు 30 ఏప్రిల్ 2025 నాటికి e-KYC ప్రక్రియను పూర్తి చేయకపోతే, మీ రేషన్ కార్డు క్యాన్సల్ చేయవచ్చు. అలాగే మీకు లభిస్తున్న సబ్సిడీ రేషన్ నిలిపివేయవచ్చు. ఇవి కాకుండా మీ పేరును రేషన్ లబ్ధిదారుల లిస్ట్ నుండి కూడా తొలగించవచ్చు. అందువల్ల ప్రతిఒక్క రేషన్ కార్డుదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి e-KYC ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు లేదా సహాయం కోసం మీరు మీ రాష్ట్రంలోని PDS అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు లేదా సమీపంలోని రేషన్ షాప్ సంప్రదించి సమాచారాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications