FASTag Alert: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. రేపే చివరి అవకాశం.. సేవలు నిలిచిపోతాయ్..
FASTag Warning: రవాణా వ్యవస్థలో ఫాస్టాగ్ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. దేశంలో వేగంగా హైవే టోల్ కలెక్షన్ అమలు లక్ష్యంగా భారత ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేసేందుకు ఫిబ్రవరి 29తో గడువు ముగియనుంది. ఒకవేళ గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయకుంటే వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వారు ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ఇబ్బంది లేకుండా ప్రయాణించాలనుకుంటే.. ఫిబ్రవరి 29లోపు మీ KYCని ఖచ్చితంగా అప్‌డేట్ చేయకపోతే మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. కొందరు వాహనదారులు ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్స్ కలిగి ఉండటం వల్ల టోల్ ఏజెన్సీలు రుసుములు వసూలు చేయటంలో ఇబ్బంది పడుతున్నారు. మరికొంది వాహనాలు ఇతరుల పేర్లపై ఉన్నాయి. ఇవి ఖచ్చింతంగా ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉంది.

ఈసారి కేవైసీ పూర్తి చేసేందుకు గడువును NHAI పొడిగించబోదని తెలుస్తోంది. జనవరి 20 నుంచి 31 మధ్య కాలంలో చాలా మంది ఇప్పటికే తమ కేవైసీ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేశారు. ఫాస్టాగ్ వాలెట్ సదుపాయాన్ని అందించే బ్యాంకులు, సంస్థల నుంచి వచ్చిన డేటా ప్రకారం జనవరి 31న KYC అప్‌డేట్ తేదీని ఒక నెల పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు ఒక వాహనంలో ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు జారీ చేయడం వల్ల సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
వాస్తవానికి ఫాస్టాగ్ నిబంధనల ప్రకారం.. ఫాస్టాగ్ తీసుకున్న వ్యక్తి పేరుమీదే వాహనం కూడా ఉండాలి. మొదట్లో వాహనం మరొకరి పేరు మీద ఉన్నప్పటికీ, ఫాస్టాగ్ జారీ చేసే వ్యక్తి KYC కలిగి ఉండటం తప్పనిసరని మినహాయింపు ఉంటుంది.
మీరు ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేయవచ్చు:
ముందుగా www.fastag.ihmcl.comని సందర్శించండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు OTP సహాయంతో ఇక్కడ లాగిన్ అవ్వండి. దీని తర్వాత డ్యాష్‌బోర్డ్ మెనులో నా ప్రొఫైల్ ఎంపికకు వెళ్లండి. ఇక్కడ KYC స్థితిని తనిఖీ చేయండి. KYC అప్‌డేట్ కాకపోతే, సబ్ సెక్షన్‌కి వెళ్లండి. ID రుజువు, చిరునామా రుజువు, ఫోటో వంటి అవసరమైన సమాచారాన్ని ఇక్కడ అప్‌లోడ్ చేయండి. దీని తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications