For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cards alert: క్రెడిట్/డెబిట్ కార్డులపై మార్చి 16 తర్వాత ఆ సేవలు బంద్

|

మీకు డెబిట్/క్రెడిట్ కార్డులు ఉన్నాయా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్‌కు ఉపయోగించలేదా? అయితే ఈ న్యూస్ మీ కోసమే! ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ కార్డులను ఉపయోగించకుంటే ఈ కార్డుల ద్వారా ఈ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఒక్కసారైనా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ కోసం వినియోగించాలి. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం కోల్పోతారు.

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు, ఫీజు తక్కువో తెలుసుకోండి?హోమ్‌లోన్ తీసుకుంటున్నారా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు, ఫీజు తక్కువో తెలుసుకోండి?

ఎప్పటి నుండి?

ఎప్పటి నుండి?

మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం వినియోగించని యెడల మార్చి 16వ తేదీ నుంచి ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌కు ఈ కార్డులు పని చేయవు.

కారణమిదే..

కారణమిదే..

డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రతను పెంచే నిమిత్తం ఈ ఏడాది జనవరి 15న భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ లేదా కాంటాక్ట్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్ నిర్వహించని కార్డులకు ఈ సదుపాయాన్ని నిలిపివేయాలని కార్డ్స్ సంస్థలకు సూచించింది.

16లోపు ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే..

16లోపు ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే..

ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారు మార్చి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే ఈ సదుపాయం ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ సదుపాయం నిలిచిపోతుంది.

ఇదీ ఆర్బీఐ ఆదేశం

ఇదీ ఆర్బీఐ ఆదేశం

ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం జారీ అయిన కార్డులకు సంబంధించి కార్డు జారీ చేసిన సంస్థలకు నిర్ణయాధికారం ఉంటుంది. కార్డుపై ఆన్‌లైన్ లేదా ఇంటర్నేషనల్ లేదా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించకుంటే కార్డుపై ఆ సర్వీసులను రద్దు చేయాలి. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టం యాక్ట్‌లోని సెక్షన్ 10(2) ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

అందుబాటులోకి కొత్త సేవలు..

అందుబాటులోకి కొత్త సేవలు..

ఇదిలా ఉండగా కార్డు యూజర్లకు కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్డు స్విచ్చాన్/ఆఫ్ లేదా అన్ని ట్రాన్సాక్షన్స్ లిమిట్ చేసుకోవడం వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొబైల్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) వంటి వాటి ద్వారా ఈ సవలు పొందవచ్చు. బ్యాంకు బ్రాంచీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కార్డు స్టేటస్‌కు సంబంధించి ఏమైనా మార్పులు ఉంటే ఆ విషయం కూడా కస్టమర్లకు ఎస్సెమ్మెస్ లేదా మెయిల్ ద్వారా సమాచారం వస్తుంది.

English summary

Cards alert: క్రెడిట్/డెబిట్ కార్డులపై మార్చి 16 తర్వాత ఆ సేవలు బంద్ | Alert: These debit, credit cards will be disabled permanently by March 16

From March 16, an RBI rule will kick in, which will automatically disable all those debit and credit cards that have never been used for online transactions. In a notification issued by the Reserve Bank of India on January 15, the apex bank had announced the move aimed at enhancing security for digital transactions.
Story first published: Sunday, March 8, 2020, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X