ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఖాతాదారుల ఉన్న ఒక ప్రధాన సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ. 100 కంటే తక్కువ యుపీఐ లావాదేవీలు, రూ. 500 లోపు డిపాజిట్లపై SMSలు పంపదని తెలియజేసింది. అయితే మెయిల్ మాత్రం వస్తుందని పేర్కొంది. మీరు యూపీఐ ద్వారా ఎవరికైనా లేదా షాపులో రూ.100 తక్కువ పంపితే ఎస్ఎంఎస్ రాదు. రూ.100 ఎక్కువ పంపితేనే మెసేజ్ వస్తుంది.
అలాగే మీకు ఎవరైనా యూపీఐ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా రూ.500 తక్కువ పింపినా మెసేజ్ రాదు. రూ.500 ఎక్కువ మీ అకౌంట్ లో వస్తేనే ఎస్ఎంఎస్ వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ విషయాన్ని ఇప్పటికే వినియోగదారులకు తెలియజేసింది. యూపీఐ ద్వారా రూ.100లోపు ఖర్చు చేసి రూ.500లోపు ఖాతాలో జమచేస్తే ఎస్ఎంఎస్ అలర్ట్‌లు రావని పేర్కొంది. కస్టమర్‌లు తమ ఇమెయిల్‌లను అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంక్ విజ్ఞప్తి చేసింది. తద్వారా వారు నోటిఫికేషన్‌లను స్వీకరించడం కొనసాగించవచ్చని తెలిపింది.

బ్యాంక్ ప్రకారం, ఇటువంటి చిన్న లావాదేవీల హెచ్చరికలు చెల్లింపు యాప్‌ల ద్వారా చేస్తారు. చిన్న లావాదేవీలపై వచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. UPI సగటు టిక్కెట్ పరిమాణం గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం తగ్గుతూ వస్తోంది. 2022, 2023 మధ్య 8 శాతం క్షీణత ఉంది. దీన్ని బట్టి చిన్న లావాదేవీలకే యూపీఐ ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
వరల్డ్‌లైన్ ఇండియా నివేదిక ప్రకారం, PhonePe, Google Pay, Paytm దేశంలో మూడు ప్రముఖ UPI యాప్‌లుగా ఉన్నాయి. NPCI డేటా ప్రకారం, 2023 సంవత్సరంలో UPI ద్వారా లావాదేవీలు 100 బిలియన్ల మైలురాయిని సాధించాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పిక్సెల్ ప్లే, పిక్సెల్ గో అనే రెండు డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేసింది. ఈ డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లను బ్యాంక్ PayZapp యాప్ ద్వారా ఉపయోగించవచ్చు. రూ.25 వేల పైబడి జీతం ఉన్న, రూ.6 లక్షల వరకు రిటర్న్‌లు దాఖలు చేసే స్వయం ఉపాధి పొందేవారు ఈ కార్డులను పొందవచ్చు.


Click it and Unblock the Notifications