అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు చాలామంది. ఇందుకు వివిధ బంగారం షాపులు ఆన్‌లైన్ ద్వారా పసిడిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంది. దీంతో బంగారం దుకాణాలు తెరిచి లేవు. అక్షయ తృతీయ సెంటిమెంట్ కాబట్టి ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆఫర్లు తెలుసుకుందాం..

పేటీఎం బంపరాఫర్
అక్షయ తృతీయ నేపథ్యంలో కస్టమర్లకు పేటీఎం అద్భుత ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తారు. దీంతో లక్ష్మీదేవి ఆ బంగారంతో పాటు తమ ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ సందర్భంగా పేటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసే వారికి ప్రతి గంటకు 100% గోల్డ్ బాక్ ఆఫర్ ప్రకటించింది. దీంతో పాటు కేవలం రూ.1తో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. పేటీఎంలోని స్వీప్ స్టేక్స్ ద్వారా బంగారం కొనిగొలు చేసే వారికి కాష్ బాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 ఏప్రిల్ 26 వరకు అందుబాటులో ఉంటుంది.

మలబార్ గోల్డ్ ఆఫర్
అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ ఆన్‌లైన్ అమ్మకాల్ని ప్రారంభించింది. లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. బంగారు ఆభరణాల ధరలో 30%, వజ్రాభరణాలపై 20% వరకు తగ్గింపు ఉంటుంది. SBI క్రెడిట్ కార్డులపై రూ.15,000కు మించి కొనుగోళ్లపై 5% క్యాష్ బ్యాక్ ఉంది.

జోస్ అలుక్కాస్ ఆఫర్లు
అక్షయ తృతీయని పురస్కరించుకుని జోస్ అలుక్కాస్ ప్రత్యేక ఆన్‌లైన్ సౌలభ్యతను ప్రవేశపెట్టింది. 26వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా ముందుగా బుక్ చేసుకుని ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. బుక్ చేసుకున్నప్పుడు, అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసినట్లుగా సర్టిఫికేట్ జారీ చేస్తారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కస్టమర్లు తమ ఆభరణాలను దగ్గరలోని జోస్ ఆలుక్కాస్ షోరూమ్‌లలో తీసుకోవచ్చు లేదా డెలివరీ సౌకర్యం కూడా ఉంది. బంగారు నగల తరుగుపై 20%, వజ్రాలపై 20% తగ్గింపు ఇస్తోంది.

ఇతర దుకాణాల్లోను..
తనిష్క్, కళ్యాణ్, లలిత జ్యువెల్లర్స్‌లలోను అద్భుత ఆఫర్స్ ఉన్నాయి. జోయ్ అలుక్కాస్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 15% క్యాష్ బ్యాక్ ఉంది. అమెజాన్, వూహూ డాట్ ఇన్ వంటి వెబ్ సైట్స్ ద్వారా కొనుగోళ్లు చేస్తే ప్రత్యేక బహుమతి వోచర్లు, ఈ-వోచర్లు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా వివిధ జ్యువెల్లర్స్ తమ తమ ఆన్ లైన్ ప్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications