నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్లు, మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌పై భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 104 కోట్ల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడితే గానీ.. బ్రేక్ ఈవెన్‌కు చేరువ కాలేదు అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ చిత్రం ఇండియా వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారా 8 కోట్ల రూపాయలు, తొలి రోజున 22.5 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు 15.5 కోట్ల రూపాయల నెట్, మూడో రోజు 15.1 కోట్ల రూపాయలు నికరంగా, 4వ రోజు 5.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.
గత నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 9.82 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.25 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 46 కోట్ల నెట్, 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక తెలుగేతర రాష్ట్రాల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 4 కోట్ల షేర్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లో 55 కోట్ల షేర్, 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని పేర్కొన్నారు.
ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఇండియా వైడ్ సుమారుగా 2.5 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా 3.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో ఈ చిత్రం 95 కోట్లు దాటి 100 కోట్ల రూపాయలకు చేరవయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications