ఆకాశ ఎయిర్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి బెంగుళూరుకు బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానం క్యాబిన్‌లో కాలిపోతున్న వాసన వచ్చింది. గ్రహించిన విమాన సిబ్బంది విమానాన్ని వెనక్కు మళ్లీంచారు. విమానాన్ని పక్షి ఢీకొట్టడం వల్ల ఇలా జరిగిందని డీజీసీఏ అధికారి శనివారం తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆరా తీసినట్లు అధికారి తెలిపారు.
అక్టోబర్ 14
అక్టోబర్ 14 శుక్రవారం నాడు ఆకాశ ఎయిర్ ఫ్లైట్ QP 1103 ముంబయి నుంచి బెంగళూరు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొంత సమయం తర్వాత ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానంలో ఉన్నవారికి వాసన వచ్చింది. సిబ్బంది అప్రత్తమై విమానాన్ని సురక్షితంగా తిరిగి ముంబయిలో ల్యాండ్ చేశారు. తమ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అకాశ ఎయిర్ ప్రతినిధి తెలిపారు.

రాకేష్ ఝన్‌ఝన్‌వాలా
ల్యాండింగ్ తర్వాత తనిఖీలు చేయగా పక్షి ఢీకొట్టినట్లు గుర్తించారు. ఆకాశ ఎయిర్ సర్వీసులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇందులో ఫేమస్, దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా పెట్టుబడి పెట్టారు.ఆకాశ ఎయిర్ ఆగస్ట్ 7న సర్వీసులు ప్రారంభించగా అక్టోబర్ 7న 60 రోజులు పూర్తి చేసుకుంది.ఆకాశ ఎయిర్ మొదటి సర్వీస్ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు నడిచింది. ఆ తరువాత చెన్నై, కొచ్చి, బెంగళూరుకు విమాన సేవలను విస్తరించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications