Akash Ambani: ఇప్పటి వరకు ప్రతి రంగంలోనూ అంబానీ దూకుడు చూస్తూనే ఉన్నాం. అయితే కొత్తగా పగ్గాలు చేపట్టిన కుమారుడు ఆకాష్ అంబానీ రికార్డుల మోత మోగించటం ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 'Time100 Next' జాబితాలో నిలిచారు. ప్రస్తుతం రిలయన్స్ జియో ఛైర్మన్ గా ఉన్న ఆకాష్ అంబానీ.. చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కావటం విశేషం.

వ్యాపారదక్షతపై టైమ్స్..
లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఆకాష్ అంబానీ లీడర్స్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఆకాష్ అంబానీ గురించి టైమ్ మ్యాగజైన్.. అతను వ్యాపారాన్ని పెంచటానికి చాలా కష్టపడుతున్నాడు. గూగుల్, ఫేస్‌బుక్‌తో బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాలను పూర్తి చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అంటూ వ్యాఖ్యానించింది.

22 ఏళ్ల వయస్సులోనే..
ప్రపంచంలోని వర్ధమాన స్టార్ ఆకాష్ అంబానీ తన 22 ఏళ్ల వయస్సులోనే జియో బోర్డులో చోటు సంపాదించినట్లు టైమ్ మ్యాగజైన్ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్‌లో భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీగా ఆవిర్భవించిన జియో సంస్థ కమాండ్ అతనికి ఇవ్వబడింది. 42 కోట్ల 60 లక్షల మంది కస్టమర్లను కలిగి ఉన్న రిలయన్స్ జియో నిర్వహణ బాధ్యత ఇప్పుడు చైర్మన్ ఆకాష్ అంబానీ భుజస్కంధాలపై ఉంది.

Jio 5G..
రిలయన్స్ జియో 5G రోల్ అవుట్ ఆకాష్ అంబానీ పర్యవేక్షణలో జరగడం గమనార్హం. దీపావళి నాటికి ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని మెట్రో నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. భారతీయ టెలికాం పరిశ్రమలో 700 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను కొనుగోలు చేసిన ఏకైక సంస్థ Jio. స్టాండ్-అలోన్ 5G నెట్‌వర్క్ అంటే ట్రూ 5G అమలు చేయగల స్పెక్ట్రమ్ బ్యాండ్ ఇదేనని క్లెయిమ్ చేయబడుతోంది.

ప్రతి సంవత్సరం జాబితా..
టైమ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం 'Time100 Next' జాబితాను ప్రచురిస్తుంది. ఈ లిస్ట్‌లో ప్రపంచంలోని అనేక ఇండస్ట్రీలకు చెందిన 100 మంది వర్ధమాన స్టార్స్ కు చోటు దక్కుతుంది. 2022కి సంబంధించిన TIME100 జాబితాలో సంగీత విద్వాంసులు అలాగే వృత్తిపరమైన వైద్యులు, ప్రభుత్వ అధికారులు, ఆందోళనకారులు, ఉన్నత స్థాయి విజిల్ బ్లోయర్‌లు, కంపెనీల CEOలు ఉన్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications