Akasa Air: సంక్షోభంలో బిగ్‌బుల్ ఎయిర్‌లైన్.. మూతపడే ప్రమాదం..!!
Akasa Air: గాల్లోకి ఎగిరి విజయవంతంగా ముందుకు సాగుతున్న బడ్జెట్ ఎయిర్ లైన్ సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో కొన్ని రూట్లలో విమాన సర్వీసుల రద్దుకు సైతం ప్లాన్ చేస్తోంది.
జున్‌జున్‌వాలా ఫ్యామిలీ నేతృత్వంలో కొత్తగా ప్రారంభించిన అకాశ ఎయిర్ సంక్షోభంలో ఉంది. 43 మంది పైలట్ల రాజీనామాల తర్వాత మూసివేయవలసి ఉంటుందని ఎయిర్‌లైన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. పైలట్ల ఆకస్మిక రాజీనామా కారణంగా క్యారియర్ సెప్టెంబర్‌లో రోజుకు 24 విమాన సర్వీసులను రద్దు చేయవలసి వచ్చిందని వెల్లడైంది.

ఫైలట్లు ఫస్ట్ ఆఫీసర్ నోటీసు వ్యవధి 6 నెలలు, కెప్టెన్ ఏడాది పాటించకుండా కంపెనీని వీడటం ఆకాశను సంక్షోభంలోకి నెట్టిందని కోర్టుకు వెల్లడించింది. దీనివల్ల అనేక విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్ న్యాయవాది తెలిపారు. వీరందరూ ప్రత్యర్థి సంస్థల్లో పనిచేసేందుకు చేరినట్లు సమాచారం. ఈ చర్య అనైతికమైనదని కంపెనీ ఇతర ఆపరేటర్లకు లేఖలు కూడా పంపింది.
రోజూ 120 విమాన సేవలను నడుపుతున్న ఆకాశ.. రాజీనామాలు కొనసాగితే ఈ నెలలో మెుత్తంగా 600- 700 సర్వీసులను రద్దు చేయాలని భావిస్తోంది. గత నెలలో ఇదే సమస్యతో 700 విమానాలను రద్దు చేసింది. తప్పనిసరి నోటీసు వ్యవధి నిబంధనలను అమలు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి అధికారం ఇవ్వాలని ఎయిర్‌లైన్ కోర్టును అభ్యర్థించింది. అలాగే పైలట్‌లపై జరిమానా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్ కోరుతున్నట్లు సమాచారం. విమానాల రద్దు, గ్రౌండింగ్ కారణంగా ఆదాయ నష్టానికి పరిహారంగా సుమారు రూ.22 కోట్లు డిమాండ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications