Akasa offers: బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఆకాశ ఎయిర్ లైన్స్ స్టార్ట్ అయ్యి ఏడాది పూర్తి కావస్తోంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా తమ నెట్వర్క్ లోని రూట్లపై సంస్థ ఆఫర్స్ ప్రకటించింది. అయితే ఇది పరిమిత కాలపు ఆఫర్ కావడంతో ఇందుకోసం వినియోగదారులు త్వరపడాల్సి ఉంటుంది.
ఆకాశ ఎయిర్ లైన్స్ నెట్వర్క్ లోని 16 దేశీయ రూట్లలో నడుస్తున్న విమాన టిక్కెట్లపై కంపెనీ 15 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఆకాశ ఎయిర్ విమానాల ద్వారా ప్రయాణించే వ్యక్తులు కంపెనీ వెబ్ సైట్, యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ కోసం వెబ్ సైట్ లో అయితే AKASA1, యాప్ లో APPLOVE కోడ్స్ ఉపయోగించాలని సూచించింది.

ఆకాశ ఎయిర్ యాప్‌లో టికెట్స్ బుక్ చేసుకుంటే ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్ రుసుమును సైతం కంపెనీ అందిస్తోంది. తద్వారా ప్రతి బుకింగ్‌పై అదనంగా 350 వరకు ఆదా చేసుకోవచ్చు. విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.
ఆగస్ట్ 2022లో ఆకాశ ప్రారంభించినప్పటి నుంచి 4 మిలియన్లకు పైగా ప్రయాణీకులను చేరవేసింది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ వంటి 16 నగరాలను కలుపుతూ 35 ప్రత్యేక మార్గాల్లో ఆపరేట్ చేస్తోంది. "ఏడాదిలోపే విమానాల సామర్థ్యాన్ని సున్నా నుంచి 20కి తీసుకెళ్లడం కేవలం ఆకాశా రికార్డు మాత్రమే కాదు, ఇండియా సామర్థ్యాన్ని సూచిస్తుంది" అంటూ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకులు, CEO వినయ్ దూబే హర్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications