రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఫ్యాషన్ వేర్ ప్లాట్‌ఫామ్ ఆజియో సంబంధం-2020 పేరుతో ఆన్‌లైన్ ట్రేడ్ షోను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లను ఒకే వేదిక పైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే పరిస్థితిలేదు. అలా అని వ్యాపారాలు నిలిపివేసే పరిస్థితి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజియో ఆన్‌లైన్ ట్రేడ్ షోను నిర్వహిస్తోంది.
వ్యాపారులు తమకు కావాల్సిన దుస్తులను కొనుగోలు చేసేందుకు 'సంబంధం డిజిటల్ ఫెస్టివల్ 2020' వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ మెగా ట్రేడ్ షో నేడు(2020 సెప్టెంబర్ 17వ తేదీ)న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ షో సెప్టెంబర్ 19న ముగుస్తుంది. ఈ ట్రేడ్ షోలో రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు కావాల్సిన దుస్తులను కొనొచ్చు.
దుస్తులతో పాటు ఆఫీసులు, ఇళ్లకు కావాల్సిన లగ్జరీ, సేఫ్టీ ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు. ఈ ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన 70,000కు పైగా రీటైలర్లు పాల్గొంటారని అంచనా. ఆజియో 'సంబంధం- 2020' ఆన్‌లైన్ ట్రేడ్ షోలో 1,300 పైగా బ్రాండ్స్‌కు చెందిన లక్షలాది స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఫెస్టీవ్ కలెక్షన్స్‌ను రూపొందించారు. 50కి పైగా ఫెస్టీవ్ వేర్ బ్రాండ్స్ సరసమైన ధరలకే దుస్తుల్ని, వస్తువులను అమ్ముతున్నాయి. లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్‌కి తగినట్లు అప్‌డేట్ చేసిన ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు.

ఇందుకోసం వ్యాపారులు ఆన్‌లైన్ ట్రేడ్ షోకు రిజిస్టర్ చేసుకోవాలి. https://register.ajiosambandam.com/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత డిజిటల్ కేటలాగ్ ఉపయోగించిన ఆర్డర్స్ చేయవచ్చు. బ్రౌజ్ చేయడంతో పాటు వీడియోస్ చూసి తమ కు నచ్చిన వాటిని విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్ లాంటి ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications