Ajax Engineering Limited IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త నెల స్టార్ట్ కాగానే కొత్త ఐపీవోల లిస్ట్ వచ్చేస్తోంది. భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ఐపీవోల వరుస రాకతో దలాల్ స్ట్రీట్ బిజీబిజీగా కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బెట్టింగ్ వేసేందుకు డబ్బు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అజాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. ఇది ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ కేదారా మద్దతు ఉన్న కంపెనీ కావటంతో మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టి ఐపీవోపై ఎక్కువగా ఉంది. ఐపీవోని ఫ్లోట్ చేసేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వద్ద ఇప్పటికే కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. బెంగళూరు కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోన్న కంపెనీ తాజా ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద 2.28 కోట్ల షేర్లను విక్రయిస్తుందని సమాచారం. అంటే ఐపీవో నుంచి కంపెనీకి ఎలాంటి ఆదాయం అందుకోదు. కంపెనీ తన ఐపీవోను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ చేయనుంది.

ఆఫర్ ఫర్ సేల్ డబ్బులు వీరికే..
ఈ ఓఎఫ్ఎస్‌లో కేద్రా క్యాపిటల్‌కు చెందిన 74,36,800 ఈక్విటీ షేర్లను విక్రయించనుందని వెల్లడైంది. ఇదే క్రమంలో ఆఫర్ ఫర్ సేల్ కింద వాటాలు విక్రయిస్తున్న వారి జాబితాను పరిశీలిస్తే.. 28,60,170 ఈక్విటీ షేర్లను కృష్ణస్వామి విజయ్, కళ్యాణి విజయ్ విక్రయించనున్నారు. జాకబ్ జిటెన్ జాన్ ద్వారా 22,88,136 ఈక్విటీ షేర్లు, జాకబ్ హాన్సెన్ ఫ్యామిలీ ట్రస్ట్ 60,06,357 ఈక్విటీ షేర్లు, సుసీ జాన్ ద్వారా 14,30,085 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నాయి.
అజాక్స్ ఇంజినీరింగ్ కంపెనీ 1992లో ప్రారంభించబడింది. కంపెనీ సెల్ఫ్-లోడింగ్ కాంక్రీట్ మిక్సర్‌లు, కాంక్రీటు ఉత్పత్తికి బ్యాచింగ్ ప్లాంట్లు, కాంక్రీటు రవాణా కోసం ట్రాన్సిట్ మిక్సర్‌లు, బూమ్ పంపులు, కాంక్రీట్ పంపులు పరికరాల తయారీ విక్రయంలో ఉంది. కాంక్రీట్‌ను ఉంచడానికి ఆటోమెటెడ్-చోదక బూమ్ పంపులు, కాంక్రీటు వేయడానికి స్లిప్-ఫారమ్ పేవర్‌లు, కాంక్రీటును డిపాజిట్ చేయడానికి 3D కాంక్రీట్ ప్రింటర్లు కూడా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ప్రముఖ కాంక్రీట్ పరికరాల తయారీ సంస్థకు కర్ణాటకలో నాలుగు అసెంబ్లింగ్, తయారీ సౌకర్యాలు కలిగి ఉన్నాయి.
కర్నాటకలోని ఆదినారాయణహోసహళ్లిలో అసెంబ్లింగ్, తయారీ కేంద్రం నిర్మాణంలో ఉంది. మార్చి 2025లో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. కంపెనీకి దేశంలోని 23 రాష్ట్రాల్లో 51 డీలర్‌షిప్‌లతో బలమైన డీలర్ నెట్‌వర్క్ కలిగి ఉంది. కంపెనీకి దక్షిణ, ఆగ్నేయాసియాలో 25 డీలర్లు, పంపిణీదారులతో దాని ప్రపంచ స్థాయికి విస్తరించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,741గా ఉండగా.. పన్ను తర్వాత లాభం రూ.225 కోట్లుగా నమోదైంది. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశంలో మెకనైజ్డ్ కాంక్రీట్ పరికరాల డిమాండ్‌ను పెంచుతుందని, పరిశ్రమను FY2024లో రూ.6,100 కోట్ల నుంచి FY2029లో రూ.17,800 కోట్లకు పెంచుతుందని అంచనా వేయబడింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications