Multibagger Stock: మార్కెట్లలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమ గమనం పైకే అన్న విధంగా ముందుకు సాగే కంపెనీల షేర్లు ఉంటాయి. వీటినే మనం మల్టీబ్యాగర్లుగా పరిగణిస్తుంటాం. వీటిని కనుక్కోవటం కొంత కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. ఇలాంటి మంచి షేర్లను తెలుసుకోవటానికి మనం కొంత శ్రమించాల్సి ఉంటుంది. శ్రమకు తగ్గట్టుగానే ఈ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తాయి. స్వల్పకాలంలోనే వారిని లక్షాధికారులను, కొన్ని సార్లైతే కోటీశ్వరులను కూడా చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టాక్ తన ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది.

స్టాక్ ప్రస్తుత విలువ..
మీరు వెతుకుతున్న మల్టీబ్యాగర్ స్టాక్ పేరు అజంతా ఫార్మా. ఒకప్పుడు ఈ షేరు ధర రూ.5 కంటే తక్కువగానే ఉండేది. కానీ.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ ఉదయం 10 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో రూ. 1,177.30గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ కొంత నెగటివ్ లోనే ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠం రూ. 1,061.77 వద్ద ఉండగా.. గరిష్ఠం 1,623.34గా ఉంది.

అద్బుతమైన రాబడి..
గత కొన్ని సంవత్సరాల్లో ఈ స్టాక్ మంచి రిటన్న్స్ అందించింది. అజంతా ఫార్మా షేర్లు మార్చి 06, 2009లో రూ.4.50 వద్ద ట్రేడ్ అయింది. కానీ దాని ప్రస్తుతం విలువ రూ. 1,177.30 వద్ద ఉంది. ఈ కాలంలో స్టాక్ లో పెట్టుబడి పెట్టిన వారికి మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చాయి. అందుకే స్టాక్ మార్కెట్లో దీర్ధకాలంలో మంచి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తుంటాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులకు 20,000 శాతం రాబడులు వచ్చాయి. అంటే.. ఆ సమయంలో స్టాక్ లో ఎవరైనా వ్యక్తి లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిఉండే.. ప్రస్తుతం వారికి రూ.2.61 కోట్లు రాబడి వచ్చి ఉండేది. కనీసం రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. సుమారు రూ. 26 లక్షల కంటే ఎక్కువ రాబడి వచ్చి ఉండేది.

10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేస్తే..
అజంతా ఫార్మా కంపెనీ షేర్లలో జూన్ 22, 2012న రూ. 59.70 ధరలో లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.19.72 లక్షలు అయి ఉండేది. అయితే ఆరు నెలల కాలంగా ఈ స్టాక్ కరెక్షన్ లో ఉంది. ఈ కాలంలో 20 శాతానికి పైగా విలువను షేర్ కోల్పోయింది. అంటే ప్రస్తుతం షేర్ తక్కువ ధరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంది. 2022 ప్రారంభం నుంచి షేర్ విలువ క్రమంలో క్షీణిస్తోంది. కరోనా సమయంలో అమ్మకాల కారణంగా కంపెనీ మంచి పనితీరును కనబరిచింది.

కంపెనీ వ్యాపారం..
అజంతా ఫార్మా భారత దేశానికి చెందిన మల్టీ నేషనల్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఈ కంపెనీ 1973లో స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ డవలప్ మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఉద్యోగులు సైతం సంస్థపై మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications