హైదరాబాద్: కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్నాళ్లు ప్రజలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. క్రమంగా ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి. కరోనా కారణంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటకి రావాలని ప్రభుత్వం చెబుతుండగా, జనాలు కూడా అవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లో ఎయిర్‌టెల్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్స్ హోమ్ డెలివరీ
హైదరాబాద్‌లో ఉంటున్న ఎయిర్‌టెల్ కస్టమర్ల శ్రేయస్సు దృష్ట్యా సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్, డీటీహెచ్ టీవీ రీఛార్జ్ వంటి సేవలను కూడా కస్టమర్లు ఇంటి నుండే పొందవచ్చునని తెలిపింది. ఈ సేవలపై ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాట్లాడారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.

సాధ్యమైనంత ఇళ్లకు పరిమితం చేసే లక్ష్యంతో..
కరోనా నేపథ్యంలో కస్టమర్లను సాధ్యమైనంత మేర ఇళ్లకే పరిమితం చేసే లక్ష్యంతో డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఈ డెలివరీ చేస్తుంది. సామాజిక దూరంలో భాగంగా కాంటాక్ట్‌లెస్ డెలివరీలను ఇంటి వద్ద అందించేందుకు నగరంలోని ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్స్ తెరిచి ఉన్నాయి. సిమ్ కార్డుతో పాటు బ్రాడ్‌బాండ్, డీటీహెచ్ సేవలు కూడా అందిస్తోంది.

నిబంధనలు... ఆరోగ్యంపై శ్రద్ధ
సిమ్ కార్డు జారీ, ఇంటర్నెట్, డీటీహెచ్ వంటి సేవల్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని, హోమ్ డెలివరీ చేసే ఉద్యోగులకు ప్రభుత్వ నియమాల మేరకు శిక్షణ ఇచ్చినట్లు గోపాల్ విట్టల్ తెలిపారు. ఎయిర్‌టెల్‌లోని అన్ని విభాగాలకు కొత్త కాంటాక్ట్‌లెస్ డెలివరీ, ఇన్‌స్టాలేషన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నించామని, విస్తృత సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించామన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications