For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tariff hike: మరోసారి కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్, టారిఫ్ పెంపు

|

ప్రముఖ టెల్కో ఎయిర్‌టెల్ టారిఫ్‌ను మరోసారి పెంచనుంది. తద్వారా ఆర్పును(ARPU) పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాదిలో మరోసారి పెంచే ఛార్జీలతో ప్రతి కస్టమర్ నుండి ప్రతి నెల వసూలు అయ్యే సగటు మొత్తం లేదా ARPU రూ.200కు చేరుకుంటుందని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా-సౌత్ ఏషియా ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ అన్నారు. వచ్చే అయిదేళ్ల కాలంలో సంస్థ ఆర్పు లక్ష్యం రూ.300కు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2021 మార్చి క్వార్టర్‌లో రూ.145గా ఉన్న ఆర్పు, 2022 మార్చి చివరి నాటికి రూ.178కి చేరుకుందన్నారు.

చిప్ సెట్స్ కొరత కారణంగా స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగాయని, 4G సేవల్లోకి అదనపు కస్టమర్లను ఆకర్షించగలగడమే ఇందుకు కారణమన్నారు. పోస్ట్ పెయిడ్ ఖాతాదారుల సంఖ్య 20 కోట్లను అధిగమించినట్లు తెలిపారు. ద్రవ్యోల్భణం, కమోడిటీ ధరలు, ఇంధన ఛార్జీలు పెరగడం వల్ల కస్టమర్లపై ప్రభావం పడుతుందని, ఇది ఎంత అనేది పరిశీలించాల్సి ఉందన్నారు.

Airtel Tariff hike: Company planning hike to up its ARPU

2021 మార్చి చివరి నాటికి ఎయిర్ టెల్‌కు 32.1 కోట్లమంది సబ్‌స్క్రైబర్లు ఉంటే 2022 మార్చి చివరి నాటికి 32.6 కోట్లకు చేరుకుంది. వచ్చే అయిదేళ్లలో బీ2బీ వ్యాపారం, బ్రాడ్ బ్యాండ్ విభాగాలు మరింత వృద్ధి చెందాలన్నారు. ఆర్పు రూ.300కు చేరడమే లక్ష్యమని చెప్పారు.

English summary

Tariff hike: మరోసారి కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్, టారిఫ్ పెంపు | Airtel Tariff hike: Company planning hike to up its ARPU

Telecom operator Bharti Airtel on Wednesday said it expects to reach the target average revenue per user of Rs 300 in 5 years while the next tariff hike, which is pending this year, will help the company cross Rs 200 mark.
Story first published: Thursday, May 19, 2022, 8:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X