Airtel Prepaid: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. బెనిఫిట్స్ తగ్గాయి, ధరలు పెరిగాయి!

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే, తన అత్యంత ప్రజాదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర ఇప్పుడు పెరిగింది. టెలికాం రంగంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పెంచుకోవాలనే లక్ష్యంతో ఎయిర్‌టెల్ ఈ అడుగు వేసినట్లు కనిపిస్తోంది.

Airtel prepaid recharge price hike 84 day plan now costs 899 rupees with 1 5GB daily data benefits

ఏ ప్లాన్ ధర పెరిగింది?

ఎయిర్‌టెల్ తన 1.5 GB డైలీ డేటా ప్లాన్‌పై ఈ ధరల పెంపును వర్తింపజేసింది. గతంలో Rs 859 గా ఉన్న ఈ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను ఇప్పుడు Rs 899 కి పెంచారు. అంటే నేరుగా 40 రూపాయల భారం వినియోగదారులపై పడనుంది. గతంలో రూ. 700 నుండి రూ. 800 సెగ్మెంట్‌లో ఎయిర్‌టెల్ రూ. 799 , రూ. 859 ప్లాన్లను ఆఫర్ చేసేది. కానీ తాజా మార్పుతో, 84 రోజుల పాటు 1.5 GB డేటా కావాలనుకునే వారు కచ్చితంగా రూ. 899 ఖర్చు చేయక తప్పదు.

కొత్త రూ. 899 ప్లాన్ ప్రయోజనాలు ఇవే!

ఈ "ట్రూలీ అన్‌లిమిటెడ్" ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు లభించే సౌకర్యాలు ఇలా ఉన్నాయి..

  • డేటా: ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. డైలీ లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps కి తగ్గుతుంది.
  • కాలింగ్: లోకల్, ఎస్టీడీ , రోమింగ్ నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్.
  • SMS: రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.
  • అదనపు బెనిఫిట్స్: ఎయిర్‌టెల్ రివార్డ్స్ కింద 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఎయిర్‌టెల్ స్పామ్ అలర్ట్స్ , ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. అయితే, గతంలో ఉన్న 'రివార్డ్స్ మినీ' సబ్‌స్క్రిప్షన్ , క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను ఈ ప్లాన్ నుండి తొలగించినట్లు సమాచారం.

ధరల పెంపు వెనుక అసలు వ్యూహం ఏమిటి?

ఎయిర్‌టెల్ (Airtel prepaid) తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక ప్లాన్‌కే పరిమితం కావడం విశేషం. దీనివల్ల కంపెనీ ఆదాయంలో తక్షణమే పెద్ద మార్పు రాకపోయినా, వినియోగదారులను నెమ్మదిగా 5G సేవల వైపు మళ్లించే వ్యూహం ఇందులో ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, డిస్కౌంట్లను తగ్గిస్తూ లాభాలను పెంచుకోవాలని కంపెనీ చూస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను రూ. 4,000 నుండి రూ. 4,999 కి పెంచిన ఎయిర్‌టెల్, ఇప్పుడు ప్రీపెయిడ్ విభాగంలో కూడా మార్పులు మొదలుపెట్టింది. ప్రస్తుతం కేవలం ఒక ప్లాన్ ధర మాత్రమే పెరిగినప్పటికీ, రాబోయే రోజుల్లో మిగిలిన ప్లాన్ల ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+