10 నిమిషాల్లో సిమ్‌కార్డు మీ చేతుల్లో.. ఎయిర్‌టెల్ బ్లింకిట్ పార్ట్నర్షిప్.. కస్టమర్లకు కొత్త ఫీచర్..
మన దేశంలో కాలంతో పాటు టెక్నాలజీ కూడా పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు మీరు ఈ కామర్స్ సైట్స్ ద్వారా ఫుడ్, రేషన్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా వివిధ వస్తువులను కొంటుండే వారు, కానీ ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో సిమ్ కార్డు ఆర్డర్ చేసే ఫీచర్ వచ్చింది. భారతదేశపు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఒక కొత్త ఫెసిలిటీ అందించేందుకు క్విక్ డెలివరీ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో చేతులు కలిపింది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా కస్టమర్లు ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకే సిమ్ కార్డు డెలివరీ పొందవచ్చు.

16 నగరాల్లో ఈ సేవలు ప్రారంభం: ఎయిర్‌టెల్ అండ్ బ్లింకిట్ కలిసి ఈ సర్వీస్ ప్రస్తుతం భారతదేశంలోని 16 ప్రముఖ నగరాల్లో ప్రారంభించింది. వీటిలో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, భోపాల్, ఇండోర్, బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, జైపూర్, కోల్‌కతా అలాగే హైదరాబాద్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ మరిన్ని ఇతర నగరాలు, పట్టణాలకు కూడా విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.
కేవలం రూ.49కే సిమ్ కార్డు డెలివరీ: కంపెనీ ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు కేవలం రూ. 49 ఛార్జీతో సిమ్ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు. టైం ఆదా చేసుకోవాలనుకునే వారు ఇంకా ఇంటి దగ్గరికే కొత్త సిమ్ కార్డు డెలివరీ పొందాలనుకునే కస్టమర్లకు ఈ సర్వీస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈజీగా ఇంకా వేగంగా KYC ప్రక్రియ: సిమ్ కార్డు డెలివరీ అందుకున్న తర్వాత కస్టమర్లు ఆధార్ బేస్డ్ KYC ప్రక్రియ ద్వారా వెంటనే నంబర్‌ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మొత్తం ప్రక్రియ వేగంగా, సింపుల్'గా ఇంకా సురక్షితంగా చేస్తుంది.
ఈ కొత్త పార్ట్నర్షిప్ అండ్ సర్వీస్ పై భారతీ ఎయిర్‌టెల్ మార్కెటింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ శర్మ మాట్లాడుతూ మా లక్ష్యం ఎయిర్‌టెల్‌తో కస్టమర్ల జీవితాలను సులభం చేయడమే. ఇందుకు బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము అలాగే త్వరలో మరిన్ని నగరాలకు ఈ సర్వీస్ విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు.
ఎయిర్‌టెల్ పెద్ద ముందడుగు: ఈ డిజిటల్ యుగంలో టెలికాం సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా ఎయిర్‌టెల్ అండ్ బ్లింకిట్ మధ్య ఈ భాగస్వామ్యం ఒక కీలక ముందడుగు. మీరు కొత్త ఎయిర్‌టెల్ సిమ్ పొందాలనుకుంటే, ఇప్పుడు మీరు దానిని కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటి వద్దకే డెలివరీ పొందవచ్చు. అది కూడా చాలా సులభమైన ప్రక్రియ ద్వారా అందుబాటులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications