ఎయిర్టెల్ ఇంటర్నెట్ సర్వీసులకు నేడు అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది. ఉదయం గం.11.30 సమయానికి సేవల్లో ఇబ్బందులు తలెత్తినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్టెల్ సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. కేవలం పది నిమిషాల్లో సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది. అసౌకర్యానికి కస్టమర్లను క్షమాపణలు కోరింది.
ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవల్లో అంతరాయంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఎయిర్టెల్ ఫైబర్ డౌన్ అయిందని, ఆ తర్వాత కాసేపటికి వచ్చిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. బ్రాడ్ బాండ్ కనెక్షన్ లేదని, అలాగే మొబైల్ నెట్ వర్క్ లేదని, ఎయిర్ టెల్ యాప్‌లోకి లాగ్-ఇన్ కాలేకపోతున్నామని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఫ్లైట్ మోడ్ అంటూ మరో నెటిజన్ చమత్కరించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, మీమ్స్ రూపంలో అభిప్రాయాలు వ్యక్తపరిచారు.

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, మంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాల్లో సేవలు కాసేపు నిలిచిపోయాయి. దీంతో మొబైల్ ఇంటర్నెట్తో పాటు ఎయిర్టెల్ బ్రాడ్ బాండ్ కస్టమర్లు సమస్యలు ఎదుర్కొన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications