ఎయిర్టెల్ తన 5.5 కోట్ల అల్పాదాయ కస్టమర్ల కోసం మంచి ఆఫర్ తీసుకు వచ్చింది. వినియోగదారులకు రూ.49 రీచార్జ్ ప్యాక్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ సన్నిహితులతో అనుసంధానమై ఉండేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపింది. ఈ ప్యాక్‌తో 28 రోజుల పాటు చెల్లిబాటు అయ్యేలా రూ.38 టాక్ టైమ్, 100 MB డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాల్యూ రూ.270 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.
అంతేకాదు, రూ.79తో రీచార్జ్ కూపన్‌ను కొనుగోలు చేస్తే వారు రెట్టింపు ప్రయోజనం పొందవచ్చును. ఈ రెండు ప్రయోజనాలు ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఇది ఏకకాల ఆఫర్. రూ.49 ఉచిత ప్యాక్ ప్లాన్ 5.5 కోట్లమంది తక్కువ ఆదాయ వర్గాలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపింది.

అంతకుముందు ఎయిర్టెల్ తన డిజిటల్ ప్లాట్‌ఫాంను పెంచడం ద్వారా కస్టమర్ల కోసం పలు రకాల కోవిడ్ మద్దతు కార్యక్రమాలను ప్రారంభించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృమవుతోన్న పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండేందుకు ప్రజలకు డిజిటల్ సాధనాలను ప్రవేశపెట్టిన సంస్థల జాబితాలో ఎయిర్టెల్ చేరింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications