ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ+.. అన్‌లిమిటెడ్ ఫీచర్లతో ఎయిర్‌టెల్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇవే!
భారతీయ టెలికాం రంగంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ రేసులో ముందంజలో ఉండేందుకు ఎయిర్‌టెల్(Airtel) మంగళవారం ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా '5G స్లైసింగ్' (5G Slicing) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే "ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్" (Priority Postpaid) సర్వీసును కమర్షియల్‌గా లాంచ్ చేసింది.
సాధారణంగా పబ్లిక్ మీటింగ్‌లు, సినిమా థియేటర్లు, కన్సెర్టులు లేదా విపరీతమైన రద్దీ ఉండే మార్కెట్ ఏరియాల్లో నెట్‌వర్క్ జామ్ అయి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. కానీ, ఈ కొత్త టెక్నాలజీతో ఎంత రద్దీ ఉన్నా సరే.. ఎలాంటి అంతరాయం లేకుండా సూపర్ ఫాస్ట్, స్థిరమైన హై-స్పీడ్ 5G ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

అసలు ఏంటి ఈ 5G స్లైసింగ్ టెక్నాలజీ?
5G నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌లో ఇదొక అత్యంత అధునాతనమైన ఫీచర్. దీని ద్వారా టెలికాం ఆపరేటర్లు తమకున్న మొత్తం నెట్‌వర్క్ కెపాసిటీని చిన్న చిన్న విభాగాలుగా (Slices) మార్చవచ్చు. అంటే, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా కొంత నెట్‌వర్క్ రిసోర్స్‌ను కేటాయిస్తారు.
దీనివల్ల మీరు ట్రాఫిక్‌లో ఉండి క్లయింట్ కాల్స్ మాట్లాడినా, వేల మంది ఉండే లైవ్ కాన్సెర్టులో వీడియోలు స్ట్రీమ్ చేసినా, క్రౌడెడ్ ఏరియాలో క్యాబ్ బుక్ చేసినా నెట్ అస్సలు స్లో అవ్వదు. ఈ విషయాన్ని ఎయిర్ టెల్ (Airtel) ఎండీ , సీఈఓ శాశ్వత్ శర్మ గర్వంగా ప్రకటించారు. ఇప్పటికే అమెరికా, సింగపూర్, యూకే వంటి దేశాల్లో ఉన్న ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఇప్పుడు ఎయిర్‌టెల్ భారత్‌కు పరిచయం చేసింది.
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ+!
ఈ సరికొత్త ప్రియారిటీ సర్వీస్ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ అన్నింటిలోనూ అందుబాటులో ఉంటుంది. పాత పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఇది ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతుంది. ప్రీపెయిడ్ యూజర్లు కావాలనుకుంటే యాప్ ద్వారా పోస్ట్‌పెయిడ్‌కు మారవచ్చు.
ఈ ప్లాన్లతో పాటు బంపర్ ఓటీటీ (OTT) ఆఫర్లను కూడా కంపెనీ ప్యాక్ చేసింది..
- రూ. 449 ప్లాన్ (Individual): దీనితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, , 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా వస్తాయి.
- హైయర్ ఫ్యామిలీ ప్లాన్స్: వీటిని తీసుకుంటే అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, యాపిల్ టీవీ+ (Apple TV+), యాపిల్ మ్యూజిక్, , నెట్‌ఫ్లిక్స్ (Netflix) సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి.
ఎలా యాక్సెస్ చేయాలి?
లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉన్న 5G స్టాండ్‌అలోన్ (Standalone) స్మార్ట్‌ఫోన్లలో ఈ సర్వీస్ సపోర్ట్ చేస్తుంది. మీ మొబైల్ దీనికి రెడీగా ఉందో లేదో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ (Airtel App) ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన సగటు ఆదాయాన్ని (ARPU) రూ. 245 నుండి రూ. 257 కి పెంచుకుంటూ బలమైన వృద్ధిని సాధించింది. ఇప్పుడు ఈ ప్రీమియం 5G స్లైసింగ్ ఫీచర్ ద్వారా తమ 29 మిలియన్ల పోస్ట్‌పెయిడ్ కస్టమర్ బేస్‌ను మరింత స్ట్రాంగ్‌గా లాక్ చేసుకోవాలని ఎయిర్ టెల్ ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications