కస్టమర్లకు జియో, ఎయిర్‌టెల్ భారీ షాక్, బేసిక్ ప్లాన్లు ఎత్తివేత.. రీఛార్జ్‌ల బాదుడే బాదుడు

Airtel, Jio discontinue Rs 249 prepaid plans : టెలికం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలు ఎయిర్ టెల్, జియోలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. గత సంవత్సరం జూలైలో Jio, Airtel, Vi లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన సంగతి విదితమే. తాజాగా ఈ దిగ్గజాలు మళ్లీ ప్లాన్‌లలో పలు మార్పులు చేశాయి. దాదాపు ఏడాది పాటు అన్ని ప్లాన్లను స్థిరంగానే ఉంచిన ఈ కంపెనీలు ఇప్పుడు బేసిక్ ప్లాన్లను ఎత్తివేశాయి. వాటికి వేరే ధరను నిర్ణయించాయి. ఇప్పటికే లక్షలాది మంది వాడుతున్న రోజువారీ 1GB డేటా ప్లాన్లను ఈ దిగ్గజాలు తొలగించాయి.రిలయన్స్ జియో తన బేసిక్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సైలెంట్ గా నిలిపివేయగా.. భారతీ ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడిచింది. రూ.249 బేసిక్ ప్లాన్ ఎంపికను నిలిపివేసింది.

ఎయిర్‌టెల్ రూ.249 రీచార్జ్ ప్లాన్‌ను నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా చందాదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. 1GB రోజు డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు 24 రోజుల చెల్లుబాటును అందిస్తూ.. చిన్న గడువులో తక్కువ ఖర్చుతో చేయదగిన ఒక "ఎంట్రీ లెవల్" ప్లాన్‌గా ఇది వినియోగదారులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అధిక కాలవ్యవధి ప్లాన్‌లకు ముందుగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలనుకునే వారు ఈ ప్యాక్‌ను "గో-టు" ప్లాన్‌గా ఉపయోగించేవారు.

249 Airtel Jio drop 249 plan 249 prepaid plan discontinued telecom tariff hike Airtel Jio 299 plan 1 5GB daily data pack entry level recharge removed budget prepaid plans axed Airtel Jio customers pushed to costlier packs minimum prepaid tariff increase 249 recharge option withdrawn 249 249 1 5GB 299 Airtel Jio discontinue Rs 249 prepaid plans

అయితే.. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఒక నోటీసు విడుదల చేస్తూ ఆగస్టు 20, 2025 నుండి ఈ ప్లాన్ ఇక అందుబాటులో ఉండదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ ప్లాన్ ఇప్పుడు ఆన్లైన్‌లో ఎక్కడా కనిపించడం లేదు.. అంటే వినియోగదారులకు ఇక నుంచి దీన్ని రీచార్జ్ చేసుకునే అవకాశం లేదు.

ఇక రిలయన్స్ జియో కూడా తన రెండింటి బడ్జెట్ ప్లాన్‌లైన రూ.209 (1GB/రోజు - 22 రోజులు), రూ.249 (1GB/రోజు - 28 రోజులు) ప్లాన్‌లను సడన్ గా నిలిపివేసింది. దీంతో జియో బేస్ ప్రీపెయిడ్ టారిఫ్ లెవెల్ రూ.299 కు చేరింది. జియో వినియోగదారుడు కనీసం రూ.299 ఖర్చుచేసినప్పుడే డేటా + కాలింగ్‌తో కూడిన ప్లాన్‌ పొందగలడు. NDTV Profit కథనం ప్రకారం, ఈ బడ్జెట్ ప్లాన్‌లు ఇంకా ఒక్కోచోట రిటైల్ అవుట్‌లెట్స్‌లో లభిస్తున్నప్పటికీ..జియో యాప్ లేదా వెబ్‌సైట్‌ ద్వారా రీచార్జ్ చేసుకునే యూజర్లుగా చూసుకుంటే ఈ మార్పు వెంటనే అమలులోకి వచ్చిందనే చెప్పాలి.

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చిన్న నగరాల్లో, స్టూడెంట్లు ఎక్కువగా రోజులా షార్ట్ టర్మ్ రీఛార్జ్ చేసుకునే వారు.కాగా టెల్కోలు ఇప్పుడు వినియోగదారులను సుదీర్ఘ కాలపు లేదా ప్రీమియం ప్లాన్‌ల వైపు మళ్లిస్తున్నారు. ఎక్కువ డేటా లేదా OTT సబ్‌స్క్రిప్షన్‌లుగా బండిల్ చేసిన ప్లాన్‌లే ప్రధానంగా కనిపిస్తున్నాయి.మంగళవారం ఎయిర్‌టెల్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. Airtel Thanks యాప్ పనిచేయకుండా పోయిందని, కాల్స్/డేటా కూడా పనిచేయడంలేదని డౌన్‌డిటెక్టర్ ప్లాట్‌ఫామ్‌లో ఒక్కసారిగా 3,500కు మించి ఫిర్యాదుల సంఖ్య నమోదైంది

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+