Wayanad News: కేరళలోని వాయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయతాండవానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వారికి బాసటగా నిలిచేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ముందుకు వచ్చింది.
ఈ ఘటన వల్ల ప్రభావితమైన వారి కోసం భారతీ ఎయిర్‌టెల్ సహాయక చర్యలను ప్రారంభించింది. తమ నెట్‌వర్క్‌లో ప్రీపెయిడ్ సహా పోస్ట్ వినియోగదారులకు తక్షణ సహాయాన్ని ప్రకటించింది. వాయనాడ్ ప్రాంతంలోని ప్రీపెయిడ్ బాధితులకు వ్యాలిడిటీ ముగిసినా మరో 3 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజూ 1 GB డేటాతో పాటు 100 ఉచిత SMSల ప్రయోజనం కల్పిస్తున్నట్లు చెప్పింది.

ఇక పోస్ట్ పెయిడ్ వినియోగదారులు బిల్లు చెల్లించేందుకు అదనపు సమయం ఇస్తున్నట్లు వెల్లడించింది. మరో 30 రోజుల అనంతరం 2 నెలల బిల్లు కలిపి పే చేయవచ్చని స్పష్టం చేసింది. క్లిష్ట సమయంలో మొబైల్ సేవలకు అంతరాయం లేకుండా బాధితులు తమ బంధువులతో కనెక్ట్ అయి ఉండేందుకు ఈ మేరకు యాక్సెస్ ఇచ్చినట్లు పేర్కొంది.
కేవలం టెలికమ్యూనికేషన్స్ సాయం మాత్రమే కాకుండా స్థానికంగా సహాయ చర్యల్లోనూ చురుకుగా పాలుపంచుకుంటోంది. కేరళ వ్యాప్తంగా ఉన్న తన 52 రిటైల్ స్టోర్లను రిలీఫ్ మెటీరియల్స్ కోసం కలెక్షన్ పాయింట్లుగా మార్చింది. వాయనాడ్‌లోని బాధిత వర్గాలకు పంపిణీ చేయడానికి అవసరమైన సామాగ్రిని సేకరించి స్థానిక ప్రభుత్వాలకు అందజేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎయిర్‌టెల్ చేస్తున్న సాయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications