5G News: అంబానీతో 5జీ యుద్ధానికి ఎయిర్‌టెల్ రెడీ.. వేల కోట్లు కొల్లగొట్టిన ప్రభుత్వం..
5G Spectrum Auction: దేశంలోని టెలికాం రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు తమ 5జీ సేవలను విస్తరించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో తమ అవసరాలకు అనుగుణంగా స్పెక్ట్రమ్ కొనుగోళ్లను చేపట్టాయి.
ఈ క్రమంలో టెలికాం సంస్థలు మొబైల్ సేవల కోసం ఉపయోగించే స్పెక్ట్రమ్ వేలం జరిగింది. ఇందులో పాల్గొన్న కంపెనీలు దాదాపు రూ.11,000 కోట్లు విలువైన బిడ్డింగ్స్ చేశాయి. తాజా వేలంలో ప్రభుత్వం 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను రూ.96,238 కోట్ల బేస్ ధరతో బిడ్డింగ్ కోసం ఉంచింది. ఈ క్రమంలో మెుత్తం స్పెక్ట్రమ్ బిడ్డింగ్ రూ.11,340 కోట్లకు ముగిసింది. బిడ్డింగ్ తొలిరోజైన జూన్ 25న స్పెక్ట్రమ్ వేలం స్పందన కూడా తక్కువగానే కనిపించింది.

మెుత్తం ఐదు రౌండ్లలో జరిగిన వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా సంస్థలు పాల్గొన్నాయి. దేశీయ కంపెనీలు హైస్పీడ్ 5జీ సేవలను అందించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలుకు ఇందులో ప్రయత్నించాయి. ఈ క్రమంలో స్పెక్ట్రమ్ వేలం కోసం రిలయన్స్ జియో అత్యధికంగా రూ.3,000 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్లను ముందస్తుగా సమీకరించాయి.
ఈ వేలంలో భారతీ ఎయిర్‌టెల్ అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది . భారతీ ఎయిర్‌టెల్ స్పెక్ట్రమ్ 6 సర్కిల్‌లలో, వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ 2 సర్కిల్‌లలో స్పెక్ట్రమ్ కొనుగోళ్లు చేపట్టాయి. 2010లో స్పెక్ట్రమ్ విక్రయ ప్రక్రియ ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఇది 10వ సారి జరిగిన వేలం. చివరిసారిగా వేలం 2022లో 7 రోజుల పాటు కొనసాగింది. ఆ సమయంలో రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన 5జీ టెలికాం స్పెక్ట్రమ్ కొనుగోళ్లను టెలికాం సంస్థలు జరిపాయి.
చివరిసారిగా 2022లో జరిగిన వేలంలో 5G టెలికాం స్పెక్ట్రమ్ విలువ రూ.88,078 కోట్లకు ముకేశ్ అంబానీ బిడ్డింగ్ చేయడంతో రికార్డు స్థాయిలో 1.5 లక్షల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. ఆ సమయంలో సునీల్ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లకు బిడ్ వేయగా, వొడాఫోన్-ఐడియా రూ.18,799 కోట్లకు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. దేశంలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న వేళ దీనికి అనుగుణంగా కంపెనీలు తమ స్పెక్ట్రమ్ కొనుగోళ్లు చేపడుతున్నాయి.


Click it and Unblock the Notifications