2016లో ఆరంగేట్రం నుండి దూసుకెళ్తున్న జియోకు ఎయిర్‌టెల్ వరుసగా మూడో నెల షాకిచ్చింది. టాప్‌లో ఉన్న వొడాఫోన్ ఐడియా, రెండో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి అతికొద్ది కాలంలోనే అగ్రస్థానంలో నిలిచింది రిలయన్స్ జియో. గత కొద్దికాలంగా ఎయిర్‌టెల్‌కు కొత్త యూజర్లు పెరుగుతుండగా, వొడాఫోన్ ఐడియాకు మాత్రం తగ్గుతూనే ఉన్నారు. ఇప్పుడు జియో మొదటి స్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉన్నాయి. మూడు నెలల క్రితం వరకు జియో యూజర్లు భారీగా పెరిగారు. అయితే వరుసగా మూడు నెలల నుండి కొత్త యూజర్లలో జియోను ఎయిర్ టెల్ బీట్ చేసింది.

జియోను మళ్లీ దాటిన ఎయిర్‌టెల్
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ప్రకారం అక్టోబర్ నెలలో కూడా జియోను అధిగమించిన ఎయిర్ టెల్ 36.7 లక్షల మంది కొత్త వైర్‍లెస్ యూజర్లు జత కలిశారు. జియో కంటే ఎయిర్‌టెల్‌కు 14.5 లక్షల మంది ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయ్యారు. జియోకు కొత్తగా సబ్‌స్క్రైబ్ అయిన వారి సంఖ్య 22.5 లక్షలు. అలాగే, ఎయిర్‌టెల్ నెట్ వర్క్‌లో 96.74 శాతం క్రియాశీల చందాదారులు ఉన్నారు.

జియో, ఎయిర్‌టెల్ చందాదారులు ఎంతంటే
అక్టోబర్ నాటికి ఎయిర్‌టెల్ చందాదారులు 33.028 కోట్లకు చేరుకున్నారు. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 32.666 కోట్లుగా ఉంది. నెల రోజుల్లోనే 36.7 లక్షల మంది జత కావడం ఏ టెల్కోకు అయినా ఇదే పెద్దది. ఇక, సెప్టెంబర్ నెలలో 40.412 కోట్లుగా ఉన్న జియో కస్టమర్లు అక్టోబర్ ముగిసే నాటికి 40.635 కోట్లుగా నమోదయింది.

వీఐ, బీఎస్ఎన్ఎల్ డౌన్
ఎయిర్‌టెల్, జియోకు చందాదారులు పెరగగా, వొడాఫోన్ ఐడియాకు 26.50 లక్షలమంది తగ్గారు. దీంతో వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య సెప్టెంబర్‌లోని 29.549 కోట్ల నుండి అక్టోబర్ నాటికి 29.283 కోట్లకు తగ్గింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) సబ్‌స్క్రైబర్స్ సంఖ్య కూడా 10,215 తగ్గి 11.888 కోట్లకు చేరింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications