విమానాశ్రయాల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం.. పీపీపీ విధానంలో 11 ఎయిర్‌పోర్టుల నిర్వహణకు గ్లోబల్ బిడ్లు..

Airport Privatisation: దేశంలోని విమానాశ్రయాల నిర్వహణను మరింత ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహణలో ఉన్న 11 విమానాశ్రయాలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే డిసెంబర్ 2026 నాటికి ప్రపంచవ్యాప్త బిడ్లను (Global Bids) ఆహ్వానించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ విమానాశ్రయాలను 50 సంవత్సరాల దీర్ఘకాలిక రాయితీ (Long-term Concession) ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టనున్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) నుంచి ఆమోదం లభించింది. బిడ్డింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యేలోపు మరిన్ని ఉన్నత స్థాయి ఆమోదాలు లభిస్తాయని భావిస్తున్నారు.

India airport privatisation 11 airports privatisation airport privatisation 2026 50-year airport concession Airports Authority of India AAI airports PPP airport model Tirupati airport privatisation Varanasi airport Bhubaneswar airport Amritsar airport Indian aviation sector airport management contracts airport infrastructure India 11 2026 50

కొత్త విధానం ప్రత్యేకత - 5 బండిల్స్‌గా విభజన:

ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. ఈ 11 విమానాశ్రయాలను 5 సమూహాలుగా (Bundles) విభజించారు. ప్రతి బండిల్‌లోనూ ఒక రద్దీగా ఉండే పెద్ద విమానాశ్రయంతో పాటు, తక్కువ ప్రయాణీకుల రాకపోకలు ఉన్న మరో చిన్న విమానాశ్రయాన్ని జత చేశారు. రద్దీగా ఉండే ప్రధాన విమానాశ్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని.. చిన్న విమానాశ్రయాల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగించుకోవడమే ఈ 'క్రాస్-సబ్సిడీ' నమూనా ముఖ్య ఉద్దేశం.

Also Read

ప్రైవేటీకరణకు ప్రతిపాదించిన 11 విమానాశ్రయాల జాబితా:

బండిల్ 1: శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం (అమృత్సర్, పంజాబ్), కాంగ్రా-గగ్గల్ విమానాశ్రయం (హిమాచల్ ప్రదేశ్).
బండిల్ 2: లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం (వారణాసి, ఉత్తర ప్రదేశ్), గయా విమానాశ్రయం (బీహార్), ఖుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఉత్తర ప్రదేశ్).
బండిల్ 3: బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (భువనేశ్వర్, ఒడిశా), హుబ్బళ్లి విమానాశ్రయం (కర్ణాటక).
బండిల్ 4: స్వామి వివేకానంద విమానాశ్రయం (రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్), ఔరంగాబాద్ విమానాశ్రయం/ఛత్రపతి శంభాజీనగర్ (మహారాష్ట్ర).
బండిల్ 5: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం (తమిళనాడు), తిరుపతి విమానాశ్రయం (ఆంధ్రప్రదేశ్).

దేశంలో పెరుగుతున్న పీపీపీ విమానాశ్రయాలు:

ప్రస్తుత సమాచారం ప్రకారం.. దేశంలో ఇప్పటికే 14 విమానాశ్రయాలు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) నమూనా ద్వారా విజయవంతంగా నడుస్తున్నాయి. కొచ్చిన్, బెంగళూరు, హైదరాబాద్, కన్నూర్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి, తిరువనంతపురం, దుర్గాపూర్, గోవాలోని మోపా విమానాశ్రయాలు ఈ జాబితాలో ఉన్నాయి.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 2026 నాటికి భారతదేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల మొత్తం సంఖ్య 165కి చేరింది. ఇందులో ప్రయాణీకుల రద్దీకి తగినట్లుగా మరిన్ని వసతులు కల్పించేందుకు దేశవ్యాప్తంగా మరో 60కి పైగా విమానాశ్రయాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తలపెట్టిన 11 విమానాశ్రయాల ప్రైవేటీకరణతో ప్రయాణీకులకు మరింత మెరుగైన అంతర్జాతీయ స్థాయి సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+