ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఫ్రీ ఎంట్రీ ఇక అంత ఈజీ కాదు! క్రెడిట్ కార్డులపై రూల్స్ మార్చేసిన బ్యాంకులు..

ఒకప్పుడు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే చాలు.. జేబులో ఉన్న క్రెడిట్ కార్డు (credit card) తీసి లాంజ్ రిసెప్షన్‌లో ఒక్క రూపాయికో, రెండు రూపాయలకో స్వైప్ చేసి లోపలికి వెళ్లిపోయేవాళ్లం. ప్రశాంతమైన వాతావరణం, ఉచితంగా వేడివేడి భోజనం, వైఫై, కాఫీ.. ఇవన్నీ ఎంజాయ్ చేసేవాళ్లం. కేవలం ప్రీమియం కార్డులకే పరిమితమైన ఈ లగ్జరీ ఫెసిలిటీని, కస్టమర్లను ఆకర్షించడం కోసం బ్యాంకులు నార్మల్ ఎంట్రీ లెవల్ కార్డులకు కూడా ఇవ్వడం మొదలుపెట్టాయి. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది! గత రెండేళ్లలో ఈ ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వెనుక ఉన్న లెక్కలను బ్యాంకులు పూర్తిగా మార్చేశాయి. ఇకపై మీరు బ్యాంకుకు లాభం చేకూర్చే కస్టమర్ అయితేనే ఈ లాంజ్ యాక్సెస్ 'ఫ్రీ'గా దొరుకుతుంది, లేదంటే లేదు!

Airport Lounge Access Credit Card New Spending Criteria Rules India

లాంజ్ యాక్సెస్ ఎందుకు కష్టమైంది?

కరోనా తర్వాత ఇండియాలో విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతో పాటు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ల బయట క్యూ లైన్లు కూడా భారీగా పెరిగిపోయాయి. కస్టమర్లు కార్డు స్వైప్ చేసిన ప్రతిసారీ.. బ్యాంకులు ఆ లాంజ్ ఆపరేటర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. జనాలు కార్డులను వేరే దేనికీ వాడకుండా, కేవలం ఎయిర్‌పోర్ట్ లాంజ్ కోసమే వాడటం ఎక్కువైంది. దీనివల్ల బ్యాంకులపై బిల్లుల భారం విపరీతంగా పెరిగింది. అందుకే ఇప్పుడు బ్యాంకులు లాంజ్ యాక్సెస్‌ను మీ 'కార్డ్ షాపింగ్ ఖర్చుల'తో లింక్ చేసేశాయి.

టాప్ బ్యాంకుల కొత్త కండిషన్స్ ఇవే!

దేశంలోని ప్రముఖ బ్యాంకులన్నీ తమ క్రెడిట్ కార్డు (credit card) నిబంధనలను సైలెంట్‌గా మార్చేశాయి..

  • ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank): చాలా కార్డులపై ఈ క్వార్టర్ (మూడు నెలల్లో) మీరు ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందాలంటే, దీనికి ముందు క్వార్టర్ లో కనీసం రూ. 35,000 అంతకంటే ఎక్కువ కార్డ్ ద్వారా ఖర్చు చేసి ఉండాలి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank): పాపులర్ కార్డులైన రెగాలియా (Regalia), టాటా నియు (Tata Neu) సిరీస్ కార్డులపై ఉచిత యాక్సెస్‌ను త్రైమాసిక ఖర్చుల టార్గెట్లతో (Quarterly Spending Milestones) ముడిపెట్టారు.
  • యాక్సిస్ బ్యాంక్ (Axis Bank): కొన్ని కో-బ్రాండెడ్ కార్డులపై డొమెస్టిక్ లాంజ్ బెనిఫిట్స్‌ను బ్యాంక్ పూర్తిగా తొలగించింది.

క్రెడిట్ కార్డ్ మార్కెట్లో కొత్త రూల్స్

ప్రస్తుతం మార్కెట్లో కార్డులను బట్టి మూడు రకాల కేటగిరీలు నడుస్తున్నాయి. ఎంట్రీ లెవల్ లేదా లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డులపై నెలవారీ లేదా క్వార్టర్లీ మినిమం ఖర్చుల కండిషన్ పెడుతున్నారు. మిడ్-లెవల్ ట్రావెల్ కార్డులపై క్వార్టర్‌కు 4 డొమెస్టిక్ విజిట్స్ ఇస్తూనే, ఇంటర్నేషనల్ లాంజ్ కోసం ప్రయారిటీ పాస్ (Priority Pass) లాంటివి ఇస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఖర్చుల కండిషన్లు తప్పనిసరి అవుతున్నాయి. ఇకపోతే వేలల్లో యాన్యువల్ ఫీజు ఉండే సూపర్-ప్రీమియం కార్డులపై మాత్రం ఇప్పటికీ అన్‌లిమిటెడ్ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు.

మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, పూర్వంలా డైరెక్ట్ కార్డ్ స్వైపింగ్ సిస్టమ్ పోతోంది. ఇప్పుడు బ్యాంక్ యాప్స్ లేదా పోర్టల్స్ లోకి వెళ్లి, మీరు టార్గెట్ రీచ్ అయ్యాక 'లాంజ్ వోచర్' (Lounge Voucher) జనరేట్ చేసుకుని క్యూ ఆర్‌ కోడ్ చూపిస్తేనే లోపలికి రానిస్తున్నారు.

ఇకపై ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఫెసిలిటీని వాడుకోవాలంటే కొంచెం ప్లానింగ్ అవసరం. మీ కార్డుపై లాంజ్ లోగో ఉన్నంత మాత్రాన సరిపోదు. మీరు గత మూడు నెలల్లో ఎంత ఖర్చు చేశారు? వోచర్ యాక్టివేట్ అయిందా లేదా? అనేవి బ్యాంక్ యాప్‌లో చెక్ చేసుకోవాలి. మొత్తానికి, బ్యాంకులు ఈ ఫ్రీ ఆఫర్లను అందరికీ పంచే రోజులకు ముగింపు పలికి.. కేవలం ఎక్కువగా ఖర్చు చేసే వాల్యూబుల్ కస్టమర్లకు మాత్రమే ఇచ్చే 'రివార్డ్'గా మార్చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+