ఎయిర్‌పోర్ట్ అథారిటీ హాంకాంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పర్యాటకులకు 5,00,000 విమాన టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్‌లో కరోనా మహమ్మారి తరువాత పర్యాటకం పూర్తిగా నిలిచిపోయింది. పర్యాటకమే ప్రధాన ఆదయంగా ఉన్న హాంకాంగ్‌కు భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు మళ్లీ హాంకాంగ్‌ను సందర్శించడం ప్రారంభించారు.
$ 254.8 మిలియన్లు
దేశంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు హాంకాంగ్ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ హాంకాంగ్ 5,00,000 ఉచిత విమాన టిక్కెట్లను ఇస్తామని ప్రకటించింది. ఈ టిక్కెట్లను వచ్చే ఏడాది పంపిణీ చేస్తామని.. వీటి ధర సుమారు $ 254.8 మిలియన్లు ఉంటుందని పేర్కొంది. విమానయాన పరిశ్రమకు సహాయం చేయడానికి రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ఈ విమాన టికెట్లు కొని ఉచితంగా అందజేయనుంది.

ఆ నిబంధన రద్దు
ఈ నిర్ణయంతో హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తుంది. కోవిడ్ -19 నిబంధనల కారణంగా పర్యాటకులు తగ్గారు. హాంకాంగ్‌కు వచ్చే వారు తమ సొంత ఖర్చులతో హోటల్ గదిలో 21 రోజులు గడపవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ వ్యవధి 7 నుంచి 3 రోజులకు తగ్గించారు. దీన్ని సెప్టెంబర్ 26న రద్దు చేశారు. హాంకాంగ్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ప్రవేశించే ముందు విమానానికి ముందు టీకా సర్టిఫికేట్, అలాగే నెగటివ్ PCR రిపోర్ట్ మొదలైనవాటిని తప్పనిసరిగా సమర్పించాలట.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications