independence day 2024: ఇండిగో ఫ్రీడమ్ సేల్.. ఫ్లైట్ టిక్కెట్లపై భారీ తగ్గింపు, 15% డిస్కౌంట్.. రెండు రోజులే ఛా
Indigo airlines: భారత్ రేపు తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు సంస్థలు వివిధ ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇ-కామర్స్ కంపెనీలు ఈ రేసులో ముందంజలో ఉండగా.. దేశీయ విమానయాన సంస్థలు సైతం ప్రయాణీకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగకా ఫ్రీడం సేల్ ను ప్రారంభించింది. దేశీయ మరియు అంతర్జాతీయ రూట్లపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను అందిస్తోంది. ఈ ఆఫర్లను ప్రయాణికులు పండుగల సందర్భంలోనూ ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది. ఆగస్ట్ 13 నుంచి ఆగస్టు 15 వరకు పరిమిత సమయం ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసింది.

ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా ప్రయాణీకులు తక్కువ ధరకే విమాన టిక్కెట్లు మరియు అదనపు సేవలను పొందవచ్చు. సాధారణం కంటే గణనీయమైన పొదుపు అందించడానికి ఈ ప్రోగ్రామ్ రూపొందించబడినట్లు ఇండిగో తెలిపింది. దేశీయ విమానాల ఛార్జీలు 1,015 నుంచి ప్రారంభం కానున్నాయి. కుటుంబం మరియు స్నేహితులను కలవడానికి లేదా విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఇదొక గొప్ప ఎంపికగా చెబుతోంది.
అంతర్జాతీయ ప్రయాణీకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఇండిగో తగ్గింపు ధరలను అందిస్తోంది. ఇంటర్నేషన్ల్ రూట్లలో వన్-వే ఛార్జీలు 3 వేల 715 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్‌లకు మాత్రమే ఈ తగ్గింపులు లభించనున్నాయి. కేవలం ధరలపై ఆఫర్స్ మాత్రమే కాకుండా ఎంపిక చేసిన 6E యాడ్-ఆన్‌లపై కూడా ఫ్లాట్ 15 శాతం తగ్గింపు ప్రకటించింది. సీటు ఎంపిక, అదనపు లగేజీ, ఫాస్ట్ ఫార్వర్డ్ మరియు స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ మేనేజ్‌మెంట్ వంటి సేవలు ఈ యాడ్-ఆన్‌లలో భాగమే.
ఇలా బుక్ చేసుకున్న టిక్కెట్లతో ఆగస్ట్ 22, 2024 నుంచి మార్చి 31, 2025 జర్నీ చేయవచ్చు. ఈ కాలంలో షెడ్యూల్ చేయబడిన విమానాలకు తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఇండిగో దేశీయ మరియు అంతర్జాతీయ నెట్‌వర్క్‌లోని డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది మరియు కోడ్‌షేర్ విమానాలకు వర్తించదని గమనించాలి. ఈ ధరలపై అదనపు పన్నులు, రుసుములు మరియు ఛార్జీలు వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications