AirIndia dresscode: ప్రభుత్వం నుంచి టాటాల చేతికి వచ్చిన అనంతరం ఎయిర్ ఇండియాలో వివిధ మార్పులు జరిగాయి. లోగో, డిజైన్ దగ్గర నుంచి విమానాల రంగు వరకు అన్నింటిలో టాటా కంపెనీ వైవిధ్యం చూపిస్తోంది. తాజాగా స్టాఫ్ డ్రెస్ కోడ్‌లోనూ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.
తన పైలట్లు మరియు సిబ్బంది కోసం కొత్త యూనిఫాంలను ఎయిర్ ఇండియా తాజాగా విడుదల చేసింది. 1932లో సంస్థను స్థాపించినప్పటి నుంచి 6 దశాబ్దాల కాలంలో సిబ్బంది డ్రెస్ కోడ్ మార్చడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఏడాది చివరి నాటికి కొత్త యూనిఫాంలో స్టాఫ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. 'ఎయిరిండియా గొప్ప చరిత్ర మరియు ఉజ్వల భవిష్యత్తుకు ఇది వాగ్దానం' అని ఎయిర్‌లైన్ తన X ఖాతాలో పోస్ట్ చేసింది.

10 వేల మందికి పైగా విమాన స్టాఫ్, గ్రౌండ్ మరియు భద్రతా సిబ్బందికి ఎరుపు, వంకాయ మరియు బంగారు రంగులలో కొత్త యూనిఫామ్‌లను సిద్ధం చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీనిని రూపొందించడానికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ఎంపిక చేసింది. 'విశ్వసనీయ, శక్తివంతమైన కొత్త భారతదేశానికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది' అని తెలిపింది.
ఎయిర్ ఇండియా అధికారిక ఖాతా ద్వారా Xలో పోస్ట్ చేసిన వీడియోలో సిబ్బంది తాజా యూనిఫాంలు ధరించి కనిపించారు. 'మా కొత్త పైలట్ & క్యాబిన్ క్రూ యూనిఫామ్‌లను పరిచయం చేస్తున్నాము. ఈ యూనిఫాంలు భారతదేశపు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ద్వారా మూడు అత్యుత్తమ రంగుల్లో రూపొందిస్తున్నాం' అని అందులో పేర్కొంది.
'ఎయిర్ ఇండియా కోసం యూనిఫాంలను రూపొందించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ జెండాను మోసే సంస్థకు సేవలు అందించడం నాకు గర్వకారణం. ఈ విధంగా భారతీయ ఫ్యాషన్ సొగసు మరియు మనోజ్ఞతను ప్రదర్శించగలగడం విశేషం. దేశపు విభిన్న సంస్కృతి మరియు సంప్రదాయాల సారాంశంతో కూడిన యూనిఫాంలను రూపొందించడం నా లక్ష్యం' అని డిజైనర్ మనీష్ మల్హోత్రా తెలిపారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications