విమాన ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ మాట్లాడుతూ... ఏటీఎఫ్ ధరలు పెరిగాయని, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణించిందని, ఈ నేపథ్యంలో విమాన ప్రయాణ ఛార్జీలు కనీసం 10 శాతం నుండి 15 శాతం పెంచవలసి ఉందని అభిప్రాయపడ్డారు.
2021 జూన్ నుండి ఏటీఎఫ్ ధర 120 శాతానికి పైగా పెరిగిందని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన దేశంలో ధరలు భారీగా పెరిగాయని, ఏటీఎఫ్ పైన పన్నులు తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. గత కొద్ది నెలలుగా విమాన ఇంధన ధరలు భరించేందుకు సాధ్యమైనంత మేరకు ప్రయత్నాలు చేశామని, తమ నిర్వహణ వ్యయాల్లో దాదాపు 50 శాతానికి పైగా ఇంధనానికే ఖర్చు అవుతోందన్నారు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ కూడా క్షీణిస్తోందని, ఎయిర్ లైన్స్ పైన ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు.

నిర్వహణ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కాబట్టి వీటిని భరించాలంటే ధరలను కనీసం పది శాతం నుండి పదిహేను శాతం పెంచక తప్పని పరిస్థితి అన్నారు. అజయ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పైస్ జెట్ షేర్లపై ప్రతికూల ప్రభావం కనిపించాయి. మధ్యాహ్నం గం.12.30 సమయానికి దాదాపు 7 శాతం పతనమైంది. ఇండిగో షేర్ కూడా 4 శాతానికి పైగా పతనమైంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications