Airfares: కరోనా మహమ్మారి సమయం నుంచి విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ.. ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్‌లోని కీలక మార్కెట్లలో విమాన రుసుములు బాగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్, ఫ్లేర్ ఏవియేషన్ కన్సల్టింగ్‌తో కలిసి ఈ ప్రాంతంలోని విమాన ఛార్జీల ట్రెండ్‌లపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
భారత్‌లో విమాన చార్జీలు 41 శాతం అత్యధికంగా పెరగ్గా.. UAEలో 34 శాతం, సింగపూర్ 30 శాతం, ఆస్ట్రేలియా 23 శాతం తర్వాతి స్థానాల్లో ఉన్నాయని అధ్యయనంలో తేలింది. నివేదిక ప్రకారం 2023 మొదటి త్రైమాసికంలో ఇండియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా మరియు జపాన్‌లతో సహా ఈ మార్కెట్‌లలో విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ అంతర్జాతీయ మార్గాల్లో స్వల్పంగా తగ్గాయి.

విమానయాన సంస్థలు లాభాలను పెంచడానికి మరియు కొవిడ్ సమయంలో నష్టాలను పూడ్చుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు ACI ఆసియా-పసిఫిక్ తెలిపారు. తక్కువ పోటీ మరియు డిమాండ్‌ను ఉండటమూ వాటికి కలిసొచ్చే అంశంగా అభిప్రాయపడ్డారు. అయితే విమానాశ్రయాలు భారీ కార్యాచరణ ప్రణాళికలతో మూలధన వ్యయాలను భారీగా వెచ్చిస్తున్నప్పటికీ.. ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందిస్తూనే ఉన్నాయి.
"ఈ అధిక విమాన ఛార్జీలు పరిశ్రమ దీర్ఘకాలిక పునరుద్ధరణకు ముప్పు కలిగిస్తాయి. విమాన ప్రయాణానికి డిమాండ్‌ను తగ్గించడం మరియు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సెక్టార్‌పై ఆర్థిక భారాన్ని పెంచడం ద్వారా అనుబంధ పరిశ్రమపై సుదూర ప్రభావాన్ని చూపవచ్చు" అని ACI ఆసియా డైరెక్టర్ జనరల్ స్టెఫానో బరోన్సీ అభిప్రాయపడ్డారు. విమాన ఛార్జీల పెరుగుదలకు ఇంధన ధరలు మరియు ద్రవ్యోల్బణం కారణం కావచ్చు. 2019తో పోలిస్తే 2022లో ఇంధన ధరలు 76 శాతం పెరిగాయి. అదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 10 శాతం పెరగడంతో ఎయిర్‌లైన్స్ ఖర్చులు పెరిగాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications