flight charges: భారతదేశంలో పండుగలకు ప్రత్యేకత ఉంది. పలువురు వ్యాపారస్తులు, కంపెనీలు ఆఫర్స్ ప్రకటిస్తాయి. సాధారణం కంటే తక్కువ ధరకు ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. అయితే కేవలం ఒక్క రవాణా రంగం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది.
పండుగలు, శెలవులు వచ్చాయంటే చాలు ప్రయాణీకుల జేబులకు చిల్లు పడినట్లే. ఓ రేంజ్ లో ఛార్జీలు మోతమోగుతుంటాయి. త్వరలో రానున్న దీపావళి సమయంలో రేట్లు పెంచి సొమ్ము చేసుకునేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలు కాచుకు కూర్చున్నాయి. భారీగా ఏర్పడిన డిమాండ్ కారణంగా విమాన ఛార్జీలు అకస్మాత్తుగా పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఈ ఏడాది నమోదైన డేటా ప్రకారం.. ఈ పండుగ సీజన్ లో విమాన ఛార్జీల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణం కంటే 282 శాతం అధికమయ్యాయి. ఇక కొన్ని ప్రసిద్ధ రూట్లలో అయితే దొరికినంత దోచుకోవడమే అన్నట్లు తయారైంది పరిస్థితి. కేవలం మెట్రో సిటీస్ మాత్రమే కాకుండా టైర్ 1, 2, 3 నగరాల విషయంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.
అహ్మదాబాద్ నుంచి కొచ్చికి డైరెక్ట్ ఫ్లైట్ కోసం రిటర్న్ టిక్కెట్ ధర నమ్మశక్యం కాని రేంజ్ కి చేరింది. ఈ రూట్ లో ప్రయాణం చేయాలంటే 57 వేలు వెచ్చించాల్సిందే. ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే విమానాలను అనుసంధానించే బాగ్డోగ్రాకు టిక్కెట్ ధర 45 వేలుగా ఉంది. వారం ముందుగా బుక్ చేసుకుంటే చండీగఢ్‌కి రిటర్న్ టిక్కెట్ ధర 10 వేలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications