Tirupati: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి ఎయిర్ ఇండియా సర్వీస్..

తిరుపతి వెళ్లే వారికి ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి ఎయిర్ ఇండియా విమానం సర్వీస్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ విమాన సర్వీస్ ప్రారంభం కానున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తిరుపతితో పాటు మరో ఐదు నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తాజా నెట్‌వర్క్ విస్తరణతో ఈ విమానయాన సంస్థకు 48 దేశీయ, 16 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపిస్తోంది.

ఈ కొత్త గమ్యస్థానాలు చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి కీలక మెట్రో కేంద్రాలతో అనుసంధానం అవుతాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ సర్వీసులతో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన వ్యాపార, పారిశ్రామిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు రవాణా మెరుగుపడుతుందని వివరించింది. తిరుపతితో పాటు ఔరంగాబాద్, కోయంబత్తూర్, జామ్‌నగర్, జోధ్‌పూర్, మదురైకు నూతన ఎయిర్ ఇండియా సర్వీసులు 2026 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, తక్కువ ఖర్చులో విమాన సేవలు అందించడం కోసం కొత్త సర్వీసులు ప్రారభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటిచింది.

Air India

ఈ 6 నగరాల నుంచి కీలకమైన మెట్రో నగరాలైన చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలతో అనుసంధానం ఉంటుందని వివరించింది. ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ ప్రస్తుతం 500 రోజు వారీ విమాన సర్వీసులను నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 100కు పైగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. కాగా తిరుమలకు దేశ నలు మూలల నుంచి భారీగా భక్తులు వెళ్తారు. అయితే తిరుపతి వెళ్లే వారు ఎక్కువగా రోడ్డు మార్గం, రైలు మార్గాల్లో వెళ్తుంటారు. అయిత ఈ మధ్య కాలంలో విమానంలో వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది.

ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తిరుపతికి విమాన సర్వీసులు నడుపుతోన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఎయిర్ ఇండియా విమానం కూడా అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లే ప్రయాణికులు సులభంగా వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది భక్తులు విమానంలో తిరుపతికి వెళ్తున్నారు. ఇది దృష్టి ఉంచుకుని కొత్త సర్వీసులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+